Big Stories

Realme GT 7 Pro Launch: తక్కువ ధరకే రియల్‌మీ GT 7 Pro స్మార్ట్‌ఫోన్.. అసలైన కిల్లర్ ఇది..!

Realme GT 7 Pro Launch: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ తన బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ తీసుకురానుంది. జూలైలో కంపెనీ చైనాలో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ Realme GT 7 Pro విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా ఈ ఏడాది చివరి నాటికి ఫోన్ విడులయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారికంగా కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి.

- Advertisement -

Realme GT 7 Pro డిసెంబర్‌లో భారత్‌లో లాంచ్ అయే అవకాశం ఉంది. ఈ ఫోన్ చైనాలో కూడా లాంచ్ కానుంది. కానీ లాంచ్ చేయడానికి చాలా నెలల ముందు ఒక చైనీస్ టిప్‌స్టర్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేశారు. Tipster Digital Chat Station Weioలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ఫోన్ స్పెసిఫికేషన్‌లు గురించి వివరించారు.

- Advertisement -

Also Read: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక తగ్గొద్దు!

టిప్‌స్టర్ ప్రకారం Realme GT 7 Pro ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే చూడవచ్చు. ఇది OLED 8T LTPO డిస్‌ప్లేగా ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో అనేక స్పెషల్ ఫీచర్లు ఉండనున్నాయి. Snapdragon 8 Gen 4 చిప్‌సెట్‌ను Realme GT 7 Proలో చూడవచ్చు. మిడ్ రేంజ్ ప్రైజ్‌లో ఫోన్‌ను తీసుకురావచ్చు.

Realme GT 7 Pro ఫోన్ 16GB RAMతో వస్తుంది. ఇది గరిష్టంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అయితే టిప్‌స్టర్ బ్యాటరీ కెపాసిటీ, పవర్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఫోన్‌లో సిలికాన్ యానోడ్ బ్యాటరీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇంతకముందు వచ్చిన Realme GT 5 Pro 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో GT 7 Pro కూడా 6000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉండొచ్చు.

Also Read: ఇదో అద్భుతం .. ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. మీరు ఎప్పుడూ చూసుండరు!

Realme GT 7 Pro కెమెరా గురించి మాట్లాడితే ఫోన్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. 3X ఆప్టికల్ జూమ్ ఇందులో చూడవచ్చు. టిప్‌స్టర్ ఇక్కడ కెమెరా గురించి పూర్తి సమాచారం అందించలేదు. రాబోయే స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ మొదటి స్మార్ట్‌ఫోన్ అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిలో కంపెనీ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News