Big Stories

Realme New 5G Mobile: అయ్యగారే నంబర్ వన్ .. రియల్‌మీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. దుమ్ములేచిపోద్ది!

Realme New 5G Mobile: చైనా‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ మార్కెట్‌లోకి వరుసగా కొత్త ఫోన్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా బడ్జెట్ ఫోన్లను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ప్రీమియం ఫోన్లపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మీ దేశంలో రియల్‌మీ Realme 13 Pro+ 5G  సిరీస్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్‌ను జనవరి 2024లో విడుదలైన రియల్‌మీ 12 ప్రో 5G సిరీస్‌కు సక్సెసర్‌గా తీసుకురానుంది.

- Advertisement -

ఈ ఫోన్‌కు చాలా మంచి స్పందన లభించింది. ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో 1.5 లక్షల మంది కొనుగోలు చేశారు. రియల్‌మీ 13 Pro దేశంలోకి వచ్చిన బ్రాండ్ మొట్టమొదటి ప్రొఫెషనల్ AI కెమెరా ఫోన్. Realme అనేక గ్రౌండ్‌బ్రేకింగ్ AI ఫీచర్లతో దాని రియల్‌మీ 13 సిరీస్ త్వరలో దేశంలోకి అందుబాటులోకి రానుంది. జూలై 4న బ్యాంకాక్‌లో జరిగే AI ఇమేజింగ్ ఈవెంట్‌లో Realme 13 Pro సిరీస్‌ను ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

Also Read: ఎంత పెద్ద మనసో.. రియల్‌మీ చీపెస్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్లు చాలా రిచ్!

Realme 13 Pro+ 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఫోన్‌లో Qualcomm Snapdragon 7s Gen 3 చిప్‌సెట్ ఉంటుంది. అయితే రియల్‌మీ 12 Pro+లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్ ఉంటుంది. రియల్‌మీ 13 Pro+ 5G నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందులో 8GB RAM+128GB, 8GB RAM+256GB, 12GB RAM+256GB, 12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఫోన్ మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్, స్కై గ్రీన్ షేడ్స్‌ కలర్స్‌లో వస్తుంది.

రాబోయే Realme 13 Pro+ 5G ఫోటోగ్రఫీ కోసం 50MP Sony IMX890 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3x జూమ్‌తో కూడిన 50MP సోనీ IMX 882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్2లో 32MP సెల్ఫీ కెమెరాను చూడొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే FCC డేటాబేస్‌లో గుర్తించబడింది. 13 ప్రో+ మోడల్‌లో VCB80AUH ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ ఇచ్చే 5,050mAh రేటింగ్ బ్యాటరీ ఉంటుందని వెల్లడైంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఐఫోన్‌ 15 ప్లస్‌పై బంపర్ డిస్కౌంట్.. ఇప్పుడే కొందాం రండి!

ఇది 190 గ్రాముల బరువు, 8.23 ​​mm మందంగా ఉంటుంది. ఇది Android 14 ఆధారంగా Realme UI 5లో రన్ అవుతుంది. జూలై 4న బ్యాంకాక్‌లో AI ఇమేజింగ్ మీడియా ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో టెస్టింగ్, సర్టిఫికేషన్ వివరాలతో పాటు AI ఇమేజింగ్ సంబంధిత సమాచారాన్ని వెల్లడించనున్నారు. ఈవెంట్ సందర్భంగా రియల్‌మీ TUV రీన్‌ల్యాండ్‌తో కొత్త సహకారాన్ని కూడా ప్రకటిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News