BigTV English

Port in depth of sea:- 15,000 ఏళ్ల క్రితం పోర్టు.. సముద్ర లోతులో..

Port in depth of sea:- 15,000 ఏళ్ల క్రితం పోర్టు.. సముద్ర లోతులో..

Port in depth of sea:- తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాలో పూమ్పుహార్ ప్రాంతంలో సముద్రంలోతున ఓ పోర్టును పరిశోధకులు కనుగొన్నారు. ఇది పూమ్పుహార్ నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో 50 నుండి 100 అడుగుల లోతులో ఉన్నట్టుగా వారు గుర్తించారు.


సముద్రం లోపల ఉన్న ఈ పోర్టు దాదాపు 250 చెదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఓ లైట్‌హౌస్, ఓ పెద్ద హార్బర్ బయటపడ్డాయి. ఓ శాటిలైట్, ఎకో సౌండర్ డేటా ద్వారా ఈ పోర్ట్ గురించి బయటపడింది. ఈ స్టడీలో తెలిపిన వివరాల ప్రకారం పూమ్పుహార్ ప్రాంతం కేవలం 2,500 సంవత్సరాల క్రితం కాకుండా 15,000 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. దాని కారణంగా ప్రపంచంలోనే అత్యంత పాత పోర్టులలో పూమ్పుహార్ కూడా ఒకటని తెలుస్తోంది.

తమిళంలోని ప్రాచీన పుస్తకం మణిమేకలైలో పూమ్పుహార్ గురించి ప్రస్తావన ఉంది. దీనికి కావేరిపూంపట్టినమ్ అనే పేరు కూడా ఉంది. అయితే ఈ సముద్ర లోతులో పోర్ట్ ఎలా ఉంది అనేది ఓ మిస్టరీలాగా ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ పరిశోధనల విషయంలో పరిశోధకులకు సాయంగా నిలబడింది.
పూమ్పుహార్ ప్రాంతంలో వరదలు, తుఫానులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇదే సముద్రం మట్టం పెరుగుదలకు కారణంగా నిలిచింది. దీని కారణంగానే పూమ్పుహార్ పోర్టు పలుమార్లు మారుతూ వచ్చిందని తెలుస్తోంది.


అండర్ వాటర్‌లో మరికొన్న విషయాలు తెలుసుకోవడం కోసం అండర్ వాటర్ ఫోటోగ్రాఫీని ప్రారంభించాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడం కోసం కనీసం సంవత్సరం సమయం పడుతుందని వారు అంటున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ కారణంగానే ఈ పోర్ట్ కనిపెట్టడం సాధ్యమయ్యిందని తెలిపారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×