BigTV English

Centre for the Fourth Industrial Revolution (C4IR) : దేశ టెక్నాలజీలో మార్పులు.. సి4ఐఆర్ సన్నాహాలు..

Centre for the Fourth Industrial Revolution (C4IR) : దేశ టెక్నాలజీలో మార్పులు.. సి4ఐఆర్ సన్నాహాలు..

Centre for the Fourth Industrial Revolution (C4IR) : కొత్తగా వచ్చే టెక్నాలజీలను గమనిస్తూ ఉండడానికి, వాటి వల్ల ఏర్పడే ఛాలెంజ్‌లను ఎదుర్కోవడానికి అక్టోబర్ 2018లో సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సి4ఐఆర్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ముఖ్యంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది.


ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ లాంటి విషయాలపై సి4ఐఆర్ దృష్టిపెడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సంబంధాన్ని గమనిస్తూ ఉంటుంది. ఇటీవల ప్రారంభమమైన డ్రోన్ సర్వీసులే దీనికి ఉదాహరణ. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రెండూ కలిసి పనిచేస్తాయి. ఇక సి4ఐఆర్‌లో మూడో పిల్లర్ పార్ట్‌నర్‌షిప్.

టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం, పరిశ్రమలు, కస్టమర్లు, కొత్తగా ప్రారంభమైన సంస్థలు అన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ఎన్నో కొత్త టెక్నాలజీలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ప్రభుత్వాలు కూడా తమవంతు కృషిని చేస్తున్నాయి. వ్యవసాయంలో టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి దాదాపు ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో సి4ఐఆర్ కలిసి పనిచేస్తోంది.


ప్రస్తుతం ఇండియాలో టెక్నాలజీ పెరుగుతుంది అని చెప్పడానికి కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో తీసుకున్న చర్యలే ఉదాహరణ. అంతే కాకుండా హెల్త్ సెక్టార్‌లో కూడా ఇండియా టెక్నాలజీని ఉపయోగించి ఎంతో ముందుకు దూసుకుపోయింది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు ఇండియా పోటీ ఇస్తోంది.

మరికొన్ని ఇతర విభాగాల్లో కూడా టెక్నాలజీని మెరుగుపరచడానికి ఇండియా కష్టపడుతోంది. అందులో ఒకటి స్కిల్స్‌ను అభివృద్ధి చేయడం. భారతదేశం సర్వీస్ సెక్టార్‌లో దూసుకుపోతోంది. దానికి స్కిల్స్‌ కూడా కలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతే కాకుండా రక్షణ విషయంలో కూడా టెక్నాలజీ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా పలు విభాగాల్లో టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి సి4ఐఆర్ కృషి చేస్తోంది.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×