Big Stories

Marathons Effect: కాళ్ల కండరాలపై మారథాన్స్ ప్రభావం..

Marathons Effect: మనిషి శరీరాలు అనేవి చూడడానికి దాదాపు ఒకేలాగా కనపడినా.. వాటిలో చాలా తేడాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శరీరాలు మాత్రమే కాదు అందులో ఉండే మెకానిజంలో కూడా చాలా రకాలు తేడాలు ఉంటాయన్నారు. అందుకే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క ఆహార పదార్థం ఒక్కొక్క విధంగా ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆహారం అనే కాదు.. వారు చేసే ప్రతీ పని ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా ప్రభావం చూపిస్తుంది. తాజాగా మారథాన్ వల్ల కలిగే ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చర్చించారు.

- Advertisement -

ఈరోజుల్లో చాలామందికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలామంది యూత్.. ఫిట్‌నెస్ అనేది తమ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందన్న ఉద్దేశ్యంతో ఫిట్‌నెస్‌ను ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా చాలామంది రన్నింగ్‌తో తమ వ్యాయామాన్ని మొదలుపెడుతున్నారు. అందులో భాగంగానే పలు మారథాన్స్‌లో కూడా పాల్గొంటున్నారు. కానీ మారథాన్స్‌లో పరిగెత్తడం వల్ల కాళ్లలోని కండరాలు అలసిపోతాయని తాజాగా శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దానివల్ల పలు ఆరోగ్య సమస్యలతో పాటు కాళ్లలో గాయాలు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

- Advertisement -

మారథాన్‌లో పరిగెత్తడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో నిరూపణ అయ్యింది. కానీ తాజాగా శాస్త్రవేత్తలు ఈ కోణంలో మరింత లోతుగా పరిశోధనలు చేపట్టారు. మామూలుగా మారథాన్‌లో పరిగెత్తిన వారు అప్పుడప్పుడు తమ కాళ్లలో వాపులను గమనిస్తూ ఉంటారు. కానీ అంతకంటే జరిగే పెద్ద డ్యామేజ్ గురించి వారు ఆలోచించరు. మారథాన్ అనేది పూర్తిగా కండరాలు డ్యామేజ్ అవ్వడానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మామూలుగా మారథాన్‌లో పరిగెత్తిన వారిలో కండరాలు వాపును గమనించామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మారథాన్‌లో పాల్గొన్న మూడు రోజుల వరకు ఈ వాపులు అలాగే ఉంటున్నాయని అన్నారు. అదే విధంగా మారథాన్‌లలో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఉంటే అది నిరంతర సమస్యకు దారితీసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. రన్నింగ్ అనేది మనిషి ఆరోగ్యానికి మేలు చేసేదే కానీ.. మితిమీరిన రన్నింగ్ అనేది, లేదా తరచుగా మారథాన్స్‌లో పాల్గొనడం అనేది కాళ్ల కండరాలకు మంచిది కాదని వారు సూచిస్తున్నారు. అందుకే కాళ్లకు వ్యాయామం కావాలంటే ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించాలని సలహా ఇచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News