Big Stories

Oppo Reno 12F 5G Launch: చింపేశారు కదా భయ్యా.. ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు..!

Oppo Reno 12F 5G launch: Oppo స్మార్ట్‌ఫోన్‌లలో పాపులర్ సిరీస్ Oppo Reno 12 ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. ఈ సిరీస్‌లో కంపెనీ Oppo Reno 12, Oppo Reno 12 Proలను విడుదల చేసింది. పరిఇప్పుడు ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్ కొత్త ఎడిషన్‌ను త్వరలో రానుంది. Oppo Reno 12F 5G మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. Oppo Reno 11F 5G తర్వాత కొత్త ఫోన్ వస్తుంది. రాబోయే Oppo Reno 12F స్మార్ట్‌ఫోన్ ఎటువంటి ఫీచర్లతో రానుందో తెలుసుకుందాం.

- Advertisement -

Oppo Reno 12F 5G, Oppo Reno 12F 4G ధర, కలర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం.. మార్కెట్‌లలో Oppo Reno 12F 4G లాంచ్ ధర దాదాపు రూ. 25,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలానే 5G వేరియంట్ ధర 4G  కంటే తక్కువగా ఉండనుంది.Oppo Reno 12F 5G, Reno 12F 4G మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తాయి. ఇందులో గ్రీన్, గ్రే, ఆరెంజ్ ఉన్నాయి.

- Advertisement -

Also Read: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక తగ్గొద్దు!

Oppo Reno 12F 5G, Oppo Reno 12F 4G స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే 12F 5G, 12F 4G స్మార్ట్‌ఫోన్లు వరుసగా MediaTek Dimensity 6300, Qualcomm Snapdragon 680 SoC ద్వారా పవర్‌‌ఫుల్‌గా ఉంటాయి. 4G వెర్షన్ NFCకి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. అయితే 5G వేరియంట్‌లో NFC ఉంటుంది.

Oppo Reno 12F 4G, 5G వేరియంట్‌లు 8-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ OV50D ప్రైమరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంటుంది. ఫోన్‌లలో కెమెరా మాడ్యూల్ చుట్టూ LED రింగ్ చూడొచ్చు. హ్యాండ్‌సెట్‌ల ముందు కెమెరాలు ఒక్కొక్కటి 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Also Read: ఆఫర్ల వర్షం.. రియల్ కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఇంత తక్కువ!

Oppo Reno 12F 5G గతంలో TDRA, EEC,  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వంటి అనేక సర్టిఫికేషన్ సైట్‌లలో గుర్తించబడింది. తరువాతి లిస్టింగ్ ఫోన్ భారతదేశంలో త్వరలో అందుబాటులో ఉంటుందని సూచిస్తుంది. ఒప్పో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల లాంచ్ తేదీల వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News