Big Stories

Oppo Reno 12 5G Series: దంచికొట్టాడు భయ్యా.. ఒప్పో రెనో నుంచి AI ఫీచర్లతో ఫోన్లు.. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు!

Oppo Reno 12 5G Series Launch In India July 12: Oppo Reno స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. రకరకాల వేరియంట్‌లలో Oppo Reno ఫోన్లు దర్శనమిచ్చి ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వచ్చే వారం Oppo Reno 12 5G సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే తేదీని ఇంకా అధికారికంగా చైనీస్ టెక్నాలజీ బ్రాండ్ వెల్లడించలేదు. తాజా నివేదికలు.. Oppo Reno 12 5G, Oppo Reno 12 Pro 5G ర్యామ్, స్టోరేజ్‌తో పాటు లాంచ్ తేదీని వెల్లడించాయి. దీని ప్రకారం.. MediaTek Dimensity 7300-Energy SoCలతో కొత్త Reno హ్యాండ్‌సెట్‌లు ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేయబడ్డాయి. వీటిలో ట్రిపుల్ రియర్ కెమెరాలు.. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

తాజాగా Oppo Reno 12 5G series లాంచ్ డేట్ గురించి ఒక చిన్న లీక్ బయటకొచ్చింది. Oppo Reno 12 5G సిరీస్ భారతదేశంలో జూలై 12న లాంచ్ అవుతుందని ఓ నివేదిక పేర్కొంది. ఇకపోతే Oppo Reno 12 5G స్మార్ట్‌ఫోన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికొస్తే.. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో Oppo Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్.. 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్లలో అందించబడుతుందని సమాచారం. ఇక ఇప్పుడు ఈ సిరీస్ ధర విషయానికొస్తే.. చైనా వెలుపల గ్లోబల్ మార్కెట్‌లో 12GB + 256GB వేరియంట్ బేస్ మోడల్ ధర EUR 499.99 (సుమారు రూ. 44,700)గా ఉంది. మరోవైపు ప్రో మోడల్ 12GB RAM + 512GB వేరియంట్ EUR 599.99 (సుమారు రూ. 53,700)గా కంపెనీ నిర్ణయించింది.

- Advertisement -

ఈ సిరీస్ త్వరలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించనప్పటికీ ఫ్లిప్‌కార్ట్ అండ్ ఒప్పో ఇండియా రెండూ కొత్త ఫోన్‌ల లాంచ్‌ను ప్రకటించడానికి తమ వెబ్‌సైట్లలో ప్రత్యేక ల్యాండింగ్ పేజీలను క్రియేట్ చేశాయి. AI రికార్డ్ సమ్మరీ, AI క్లియర్ వాయిస్ అండ్ AI రైటర్‌తో సహా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ ఫీచర్‌లతో ఈ మోడల్స్ భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేయబడతాయని తెలుస్తోంది.

Also Read: AI ఫీచర్లతో రెనో 5జీ సిరీస్ వచ్చేస్తుంది మావా.. ఇక చెడుగుడే!

ఇక Oppo Reno 12 5G సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Oppo Reno 12, Reno 12 Pro చైనీస్ వేరియంట్‌లు వరుసగా MediaTek డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SoC, డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. MediaTek డైమెన్సిటీ 7300-ఎనర్జీ SoCలు గ్లోబల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలు, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. రెండింటిలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News