Big Stories

Oppo Reno 12 5G Series: AI ఫీచర్లతో రెనో 5జీ సిరీస్ వచ్చేస్తుంది మావా.. ఇక చెడుగుడే!

Oppo Reno 12 5G Series Available in Flipkart: ప్రముఖ టెక్ బ్రాండ్ ఒప్పో ఈ సారి మరింత స్టైలిష్‌ అండ్ అదిరిపోయే ఫీచర్లతో కొత్త సిరీస్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే Oppo Reno 12 సిరీస్‌ లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్‌ను AI ఫీచర్‌తో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కాగా Oppo Reno 12, Oppo Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు MediaTek Dimensity SoC ప్రాసెసర్‌లతో గత వారం ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ విడుదల చేసింది.

- Advertisement -

ఇప్పుడు ఈ చైనీస్ టెక్ బ్రాండ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో భారతీయ వేరియంట్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఆధారితమైన అనేక లక్షణాలను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Also Read: చింపేశారు కదా భయ్యా.. ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు..!

ఇక Oppo Reno 12 5G సిరీస్ త్వరలో భారతదేశంలో ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్‌లను ఏఐ ఫీచర్‌తో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలిపింది. గ్లోబల్ మార్కెట్‌లో రెండు వేరియంట్లగా రిలీజ్ అయిన రెనో 12 సిరీస్.. భారత మార్కెట్‌లో కూడా అదే వేరియంట్లుగా విడుదల అవుతాయని భావిస్తున్నారు. అయితే కంపెనీ ఈ రెండు ఫోన్ల సేల్ పార్టనర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ను సెలెక్ట్ చేసుకుంది. దీని కారణంగానే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ల గురించి ప్రత్యేకమైన బ్యానర్‌ పేజీ అందించింది.

ఆ బ్యానర్ ప్రకారం.. ఈ రెండు ఫోన్లు స్లీక్ డిజైన్, షైనీ ఫ్రేమ్‌లతో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే పక్కవైపు ఒక ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు. ఇది ఫొటోలను తీసే సమయంలో వెలుతురునిచ్చి మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఇక ఈ రెండు ఫోన్‌లు AI బెస్ట్ ఫేస్, AI ఎరేజర్ 2.0, AI స్టూడియో, AI క్లియర్ ఫేస్ వంటి అనేక AI-ఆధారిత కెమెరా ఫీచర్‌లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే AI క్లియర్ వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను 40dB వరకు తగ్గించడానికి అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అలాగే Oppo Reno 12 సిరీస్ అంచనా వేయబడిన స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే..

Also Read: Poco X6 Neo 5G Offer: బీభత్సమైన ఆఫర్.. బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్!

Oppo Reno 12, Reno 12 Pro చైనీస్ వేరియంట్‌లు వరుసగా MediaTek డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SoC, డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్‌పై నడుస్తాయి. గ్లోబల్ వెర్షన్‌లు MediaTek డైమెన్సిటీ 7300-ఎనర్జీ SoCలను కలిగి ఉన్నాయి. Oppo Reno 12, Reno 12 Pro రెండు ఫోన్లలో డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాలు, 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. రెండు హ్యాండ్‌సెట్‌లు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అమర్చబడి ఉంటాయి. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News