Big Stories

Oppo A3 Pro Launched: మస్త్‌గా ఉంది.. ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇది నిజంగా తోపు!

Oppo A3 Pro Launched: ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ కొత్త ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే వీటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఒప్పో కంపెనీ Oppo A3 Pro స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. భారతదేశంలో తన A-సిరీస్ లైనప్‌ను విస్తరించనుంది. ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. దీనితో పాటు ఫోన్‌కు  IP54 రేటింగ్‌ సపోర్ట్ కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక 64MP కెమెరాను తీసుకొచ్చారు.

- Advertisement -

Oppo A3 Pro ధర గురించి చెప్పాలంటే ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 8GB+128GB, 8GB+256GB. దీని బేస్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది. హై వేరియంట్ ధర రూ. 19,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూన్‌లైట్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో Amazon.in, Flipkart, Oppo ఈ-స్టోర్, ఆఫ్‌లైన్‌లో రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Also Read: ఇది సూపర్.. రూ.11 వేలకే రెడ్‌మీ కొత్త ఫోన్.. జూలై 9న లాంచ్!

Oppo A3 Pro స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు HDFC బ్యాంక్, SBI కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ICICI బ్యాంక్ నుండి క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయడంపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందుతారు. 6 నెలల పాటు నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.

Oppo A3 Pro స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఇందులో 6.7 అంగుళాల ఫుల్ HD + కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1080×2412 పిక్సెల్‌లు. ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో 8GB+128GB, 18GB+256GB వేరియంట్‌లు ఉన్నాయి. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: గట్టిగా పట్టెయ్.. కొత్త ఫోన్ లాంచ్.. అమేజింగ్ ఆఫర్లు!

Oppo A3 Pro ఫోన్ 5100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. స్మార్ట్‌ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్ Android 14లో కంపెనీ ColorOS 14 ఓవర్‌లేతో రన్ అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News