Big Stories

OnePlus Ace 3 Pro: అబ్బా ఏమైనా ఉందా.. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇది కొనాల్సిందే!

OnePlus Ace 3 Pro: టెక్ దిగ్గజ కంపెనీ వనప్లస్ తన బ్రాండ్ నుంచి రాబోయే Ace 3 Pro స్మార్ట్‌ఫోన్‌ని  త్వరలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో దాని డిజైన్,స్పెసిఫికేషన్‌ల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోన్‌ 100W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రావచ్చు. ఇది 6.78 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే OnePlus ఇంకా Ace 3 Proని అధికారికంగా ప్రారంభించలేదు. ఈ ఫోన్ గురించి ఇంటర్నెట్‌లో ఉన్న లీకుల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

OnePlus Ace 3 Pro స్మార్ట్‌ఫోన్ గ్లాస్, సిరామిక్, వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో రావచ్చు. లీక్‌ల ప్రకారం సిరామిక్ వేరియంట్ వైట్ కలర్‌లో మాత్రమే ఉంటుంది. గ్లాస్ వేరియంట్ బ్రైట్ వెండి కలర్ ఫినిషింగ్‌తో రావచ్చు. OnePlus 11, OnePlus 12లకు ఈ ఫోన్ సమానంగా ఉంటుంది. రాబోయే Ace 3 Pro కూడా రౌండ్ షేప్ కెమెరాను కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read:  ఇదెలా సాధ్యం.. వేలల్లో తగ్గిన ఐఫోన్ ప్రైజ్.. మిస్ కాకండి! 

OnePlus Ace 3 Proలో  6.78-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ ప్యానెల్ 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను తీసుకురావచ్చు. దీని కోసం పంచ్ హోల్ కటౌట్ అందుబాటులో ఉంటుంది. బ్యాక్ మూడు కెమెరాలు ఉంటాయి. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ లేదా మాక్రో సెన్సార్ చూడొచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ ఉందా.. వద్దన్నా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. అసలు సీక్రేట్ ఇదే!

OnePlus Ace 3 Proలో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ ఉంటుంది. అలానే 16GB RAM+1TB వరకు స్టోరేజ్ ఉంటుందని లీకులు ద్వారా తెలుస్తుంది. ఫోన్ 6,100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే వన్‌ప్లస్ నుంచి అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే. OnePlus Ace 3 Pro చైనాలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. చైనాలో ప్రారంభించిన తర్వాత స్మార్ట్‌ఫోన్ భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్లలో ఏస్ మోడల్స్ రీబ్రాండ్ చేయబడుతున్నాయి. ఈ ఫోన్‌ను కంపెనీ R లైనప్‌లో కూడా రావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News