Big Stories

OnePlus Nord CE4 Lite: ఓరీడు దుంపతెగ.. ఇవేం ఫీచర్లరా బాబు మతిపోతుంది.. 50 MP కెమెరా, 5500mAh బ్యాటరీతో పాటు మరెన్నో..!

OnePlus Nord CE4 Lite Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లుక్, డిజైన్, ఫీచర్ల పరంగా అందరికీ అట్రాక్ట్ చేస్తుంది. బ్రాండ్‌డె కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. అయితే ఇప్పటికే చాలా మోడళ్లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ ఇప్పుడు మరొక అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. OnePlus ఏప్రిల్‌లో OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

- Advertisement -

ఇప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే దాని పేరు వెల్లడించనప్పటికీ.. అది Nord CE4 Lite కావచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించి జూన్ 18 సాయంత్రం 7 గంటలకు బిగ్ ఇన్ఫర్మేషన్ రివీల్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కంపెనీ జూన్ 24, 2024న ఈ కొత్త వన్‌ప్లస్ నార్డ్ సిఈ4 లైట్ ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశముందని అంటున్నారు.

- Advertisement -

Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. ఫొటోల కోసం కెమెరాలు అవసరమే లేదు.. బడా బ్యాటరీలతో కొత్త ఫోన్లు

ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్ అంచనా స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. త్వరలో లాంచ్ కాబోతున్న OnePlus Nord CE4 Lite స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD plus OLED డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీని డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని పొందే ఛాన్స్ కనిపిస్తుంది. ఇందులో Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ఇవ్వబడుతుంది. దీనితో పాటు 8GB RAMతో అందించబడుతుంది. అలాగే 128GB నుండి 256GB వరకు స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను 1 TB వరకు ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు.

Nord CE4 Lite స్మార్ట్‌ఫోన్ Android 14 OSలో రన్ అవుతుంది. దానిపై ఆక్సిజన్ OS 14 లైన్ ఉంటుంది. అలాగే దీని కెమెరా విషయానికొస్తే.. ఇందులో ఫోన్ వెనుక భాగంలో 50 MP ప్రధాన వెనుక కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. దానితో పాటు 2 MP డెప్త్ సెన్సార్‌ని కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో 16 MP కెమెరాను అందించవచ్చు. Nord CE4 Lite ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. త్వరలో ఈ ఫోన్ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News