Big Stories

New Mobile Offers: పిచ్చెక్కించే ఆఫర్స్.. రూ.1300కే వన్ ప్లస్ 5G ఫోన్లు.. ఇదేందీ బ్రో!

New Mobile Offers: ప్రస్తుత ప్రపంచమంతా మొబైల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, ఈ కామర్స్ సైట్‌లు తక్కువ ధరకే వీటిని అందిచడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అమెజాన్‌ OnePlus 11R మళ్లీ ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఇది ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 27,999కి అందుబాటులో ఉంది. అయితే దాని అప్‌గ్రేడ్ మోడల్ OnePlus 12R ఇప్పటికే రూ. 39,998కి సేల్‌కి తీసుకొచ్చింది. రెండు 5G ఫోన్‌ల మధ్య రూ. 12,000 తేడా ఉంది. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ అసలు ధర అమోజాన్‌లో రూ. 39,999గా ఉంది. అయితే అమోజాన్ దీనిపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్‌తో ఫోన్‌ను రూ.27,999కే కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ EMI రూ.1,357గా ఉంది. ఫోన్ రెడ్, ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. OnePlus 12R రూ.39,998 ధరతో ఉంది. దీనిపై రూ.2000 కూపల్ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఫోన్‌ను రూ.37,998కి కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ EMI రూ.1,939గా ఉంది.

- Advertisement -

Also Read: ధమకా ఆఫర్స్.. చాలా చవకగా కొత్త 5G ఫోన్.. గొప్పోళ్లు భయ్యా!

OnePlus 11Rలో ఉండే Snapdragon 8+ Gen 1 చిప్‌తో పోలిస్తే OnePlus 12R‌లో బెటర్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ ఉంటుంది. అందువల్ల మీరు 12Rలో కాస్త బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది. రెండు మోడల్‌లు AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. అయితే OnePlus 12R పీక్ బ్రైట్నెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మంచి వ్యూ అనుభావాన్ని అందిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ని అడ్జెస్ట్ చేయడానికి కొత్త వెర్షన్‌లో LTPO ప్యానెల్ కూడా ఉంది.

చాలా మంది కొనుగోలుదారులకు ఫోన్‌లో మంచి బ్యాటరీ ఉండాలనుకుంటారు. ఈ సందర్భంలో OnePlus 12R 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది OnePlus 11R 5000mAh బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. అంటే ఇది కొంచెం ఎక్కువ బ్యాకప్ పొందుతుంది. అయితే రెండు ఫోన్‌లు 100W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇవి దాదాపు 30-35 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలవు. అందువల్ల OnePlus 12R బ్యాటరీ లైఫ్ పరంగా కొంచెం మెరుగ్గా ఉంది. ఛార్జింగ్ టైమ్ రెండు మోడళ్లలో ఒకే విధంగా ఉంటుంది.

Also Read: ఫస్ట్ టైమ్.. నథింగ్ 2 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదీలెక్క!

కెమెరా పరంగా OnePlus 12R లో చిన్న అప్‌గ్రేడ్‌లు కనిపిస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అయితే OnePlus 12R డే టైమ్‌లో కొంచెం మెరుగైన లో-లైట్ ఫోటోగ్రఫీ, డైనమిక్ రేంజ్, కలర్ ఆక్యురసీ అందిస్తుంది. ఫలితంగా ఫోటో క్వాలిటీ కొద్దిగా మెరుగుపడుతుంది. మొత్తంమీద మీరు మీ అవసరాలకు అనుగుణంగా రెండు ఫోన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News