Big Stories

Realme P1 Pro Special Offer: మామూలు ఆఫర్ కాదు సామీ.. ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. కొన్ని గంటలే ఛాన్స్!

Realme P1 Pro Special Offer: Realme ఈ సంవత్సరం ఏప్రిల్ 15 న ఇండియా మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Realme P1, Realme P1 Pro. ఇప్పుడు టాప్-ఎండ్ మోడల్  Realme P1 Proపై కంపెనీ, Flipkart స్పెషల్ డిస్కౌంట్లను తీసుకొచ్చాయి. ఫోన్ సూపర్ స్లిమ్ కర్వ్డ్ డిస్‌ప్లే, రెండు కలర్ ఆప్షన్‌లు వస్తుంది. ఫోన్‌పై అందుబాటులో ఉన్న బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ యూజ్ చేయడం ద్వారా మీరు ఫోన్‌ను వేల రూపాయల తక్కువకు కొనుగోలు చేయవచ్చు. మీరు తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫోన్‌‌పై లభించే డీల్స్ గురించి తెలుసుకోండి.

- Advertisement -

కొనుగోలుదారులు Flipkart, Realme అధికారిక వెబ్‌సైట్ రెండింటి నుండి ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు. లాంచ్ సమయంలో Realme P1 Pro స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 22,999లగా ఉంది. అయితే ప్రస్తుతం ఫోన్ 8GB + 128GB వేరియంట్‌పై ఫ్లాట్ రూ. 2500 తగ్గింపు అందిస్తోంది. 8GB + 256GB వేరియంట్‌పై ఫ్లాట్ రూ. 4000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

- Advertisement -

ఈ ఆఫర్ ద్వారా 128GB మోడల్ ధర రూ. 19,499గా అవుతుంది. 256GB వేరియంట్  ధర రూ. 18,999లగా ఉంది. అంతే కాకుండా Flipkart ఫోన్  128GB మోడల్‌పై రూ. 2,500, 256GB మోడల్‌పై రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీరు ఈ రెండు ఆఫర్‌లను పూర్తిగా ఉపయోగించినట్లయితే 8GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 14,999లగా ఉంటుంది. ఇది కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక తగ్గొద్దు!

Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌ సూపర్ స్లిమ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో గేమింగ్ ఫీల్‌ను అందిస్తోంది . ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ Sony LYT-600 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News