Big Stories

CMF Phone 1: ఎట్టకేలకు ఫుల్ డిజైన్ అండ్ కలర్ వేరియంట్లు ప్రకటించిన నథింగ్.. ఫోన్లు భలే ఉన్నాయ్ గురూ!

CMF Phone 1 Colors and Design Revealed: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నథింగ్ సబ్ బ్రాండ్ CMF Phone 1 త్వరలో భారత మార్కెట్‌లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ రోజుకో అప్డేట్ ఇస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే CMF Phone 1 డిజైన్, ప్రాసెసర్‌ వంటి ఫీచర్ల అప్డేట్‌లను వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ఫుల్ డిజైన్ అండ్ కలర్‌ వేరియంట్లను అధికారికంగా ప్రకటించింది. ఈ CMF Phone 1 భారతదేశంలో CMF బడ్స్ ప్రో 2, CMF వాచ్ ప్రో 2తో జూలై 8న లాంచ్ కాబోతుంది. కాగా కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది.

- Advertisement -

ఈ CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ డిజైన్ అండ్ కలర్‌ ఆప్షన్లను ఎంతో సీక్రెట్‌గా దాచిన నథింగ్ కంపెనీ తాజాగా వాటిని రివీల్ చేస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఈ ఫోన్ గురించి అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి ఇందులో రౌండ్ నాబ్‌ను కంపెనీ చూపించేది. అయితే అది ఏంటా అని ఫోన్ ప్రియులు తెగ చర్చించుకునేవారు. ఇవాళ్టితో ఆ చర్చలకు తెర పడింది.

- Advertisement -

ఇక ఈ ఫోన్ డిజైన్ అండ్ కలర్‌లు రివీల్ అయిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ల కంటే ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయని అంటున్నారు. రెగ్యులర్ ఫోన్లకు భిన్నంగా CMF Phone 1 కనిపిస్తుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేసేందుకే కంపెనీ డిఫరెంట్ లుక్‌తో అదిరిపోయే ఫీచర్లను ఇందులో అందించినట్లు తెలుస్తోంది.

Also Read: కొళ్లగొట్టేందుకు కొత్త బ్రాండ్.. లాంచ్‌కు సిద్ధమైన ‘CMF Phone 1’.. ఫీచర్లు ఓ రేంజ్..!

కాగా ఈ ఫోన్ వెనుక వైపున్న స్క్రూలు దేని కోసం వినియోగించాలో అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూ సెటప్ ఫోన్‌కు పవర్ బ్యాంక్‌ను అటాచ్ చేసుకునేందుకు అందించినట్లు తెలుస్తోంది. అదే కాదు ఫోన్‌కు బ్యాక్ సైడ్ ఉన్న రౌండ్ నాబ్‌ పై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రౌండ్ నాబ్ ప్రకారం.. ఇది ఫోన్‌ను ఎక్కడైనా తగిలించుకునే హాంగర్‌లా పనిచేస్తుందని సమాచారం.

దీంతోపాటు సాధారణ ఫోన్లకు అందించే విధంగా CMF Phone 1 స్మార్ట్‌ఫోన్‌కు కూడా చిన్న సిమ్ ఎజెక్ట్ పిన్‌ను అందించారు. అయితే ఇది ఇతర స్మార్ట్‌ఫోన్ల సిమ్ ఎజెక్ట్ పిన్‌లా కాకుండా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇది ఒకవైపు సన్నని సిమ్ ఎజెక్ట్ పిన్‌లా కనిపిస్తుంది. అదే సమయంలో మరోవైపు స్క్రూడ్రైవర్‌లా కనిపిస్తుంది. దీని ప్రకారం.. ఇది ఫోన్‌లో అందించిన స్క్రూలను ఫిట్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుందని తెలుస్తోంది.

Also Read: నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 ఫీచర్లు లీక్.. ధర, స్పెసిఫికేషన్, లాంచ్ వివరాలివే!

ఇక ఈ ఫోన్ బ్లాక్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో వెనుక కెమెరా అల్ట్రా XDR మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ పంచ్ హూల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ CMF ఫోన్ 1 6.67-అంగుళాల AMOLED స్క్రీన్‌తో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2,000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇది 8జీబీ ర్యామ్ + 8జీబీ బూస్ట్ ఫీచర్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 7300 5G SoC పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీని అందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News