Big Stories

CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 ఫీచర్లు లీక్.. ధర, స్పెసిఫికేషన్, లాంచ్ వివరాలివే!

CMF Phone 1 Launch Date: నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ CMF Phone 1 త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ వచ్చే నెల అంటే జూలై 8న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇది నథింగ్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన సిఎమ్ఎఫ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుంది. ఇది హెచ్‌డిఆర్, అధిక రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తాజాగా వెల్లడించింది. అయితే లాంచ్‌కు ముందు దీని డిస్‌ప్లే స్పెసిఫికేషన్లను ప్రారంభించింది. ఇందులో భాగంగానే లాంచ్ డే వరకు డైలీ ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఒక్కొక్క భాగాన్ని వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

అయితే తాజాగా ఈ కంపెనీ తన ఫోన్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్లను వెల్లడించింది. దీని ప్రకారం CMF Phone 1.. 6.67 అంగుళాల sAMOLED LTPS స్క్రీన్‌ను కలిగి ఉంటుందని CMF ట్టిట్టర్ ఎక్స్‌లో తన అధికారికంగా తెలిపింది. అంతేకాకుండా ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. FHD+ రిజల్యూషన్ 2000 నిట్‌ల వరకు ఉంటుందని.. అలాగే వైబ్రెంట్, లైఫ్‌లైక్ కలర్స్ కోసం హెచ్‌డీఆర్ మద్దతుతో అందుబాటులోకి రానుందని తెలిపింది.

- Advertisement -

CMF తన ఇన్‌స్టా పేజీలో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ఎల్‌సిడీ ప్యానెల్‌తో సిఎంఎఫ్ ఫోన్ 1 డిస్‌ప్లేను చూపించింది. ఇక ఇవాళ కంపెనీ పోస్ట్ ప్రకారం.. ఈ ఫోన్ లాంచ్ అయ్యే వరకు డైలీ ఒక్కొక్క స్పెసిఫికేషన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇది వరకు లీక్ అయిన ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ విషయానికొస్తే.. ఇది 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంటుందని చెప్పబడింది.

Also Read: నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి తొలి ‘CMF ఫోన్ 1’ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే!

ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 7300 SoCలో రన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 6/8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB స్టోరేజ్‌ వరకు విస్తరించుకోవచ్చు. CMF ఫోన్ Android 14తో 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌ల మద్ధతుతో వస్తుంది. అలాగే బ్యాటరీ విషయానికొస్తే.. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉండే ఛాన్స్ ఉంది.

అంతేకాకుండా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో IP52 రేటింగ్‌ను అందించే అవకాశం ఉంది. ఇక భారతదేశంలో CMF ఫోన్ 1 ధర విషయానికొస్తే.. CMF Phone 1 6జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,999 లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్ +128GB స్టోరేజ్ రూ.17,999 ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేయబడింది. లాంచ్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్‌లతో దీనిని మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News