Big Stories

HMD Fusion with Magsafe Feature: ఆట మొదలైంది.. ఐఫోన్ ఫీచర్స్‌తో నోకియా నుంచి తోపు ఫోన్..!

HMD Fusion with Magsafe Feature: నోకియా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హెచ్‌ఎండీ ఓవైపు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తూనే మరోవైపు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా మార్కెట్లోకి ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ త్వరలో HMD Fusion ఫోన్ లాంచ్ చేసే పనిలో పడింది. ఈ రాబోయే ఫోన్ ఫీచర్ల గురించి చాలా సమాచారం లీక్ అయింది.

- Advertisement -

ఆ సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల IPS డిస్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో తీసుకొచ్చిన ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపొర్ట్ ఇస్తుంది. ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ చేయవచ్చు. Apple MagSafe వంటి ఫీచర్‌ను కూడా కంపెనీ ఫోన్‌లో అందించబోతోంది.

- Advertisement -

Also Read: ఆఫర్ల సందడి.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. అదిరింది బాబాయ్!

కంపెనీ ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌ను తీసుకొస్తుంది. ఫోన్ కెమెరా సెటప్ అద్భుతంగా ఉండబోతోంది. ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇది 108-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మీరు సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 4800mAh కావచ్చు. ఇది 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Apple లాంటి మాగ్నెటిక్ అటాచ్‌మెంట్ కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ Wi-Fi 6E, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఫోన్ అతిపెద్ద ఫీచర్ పోగో పిన్స్. ఇవి మాగ్నెటిక్ అటాచ్‌మెంట్‌లు, ఇవి ఎక్కువగా Apple MagSafe నుండి డెవలప్ చేశారు. దాని సహాయంతో మీరు ఫోన్‌కి మూడవ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా గేమింగ్ కంట్రోలర్‌ను యాడ్ చేయవచ్చు.

Also Read: గట్టిగా పట్టెయ్.. కొత్త ఫోన్ లాంచ్.. అమేజింగ్ ఆఫర్లు!

HMD Tab Liteని కూడా కంపెనీ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. నివేదిక ప్రకారం ఈ ట్యాబ్‌లో మీరు 1340 x 800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 8.7 అంగుళాల IPS డిస్‌ప్లే చూస్తారు. ఈ డిస్‌ప్లే 560 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ట్యాబ్ 4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది Unisoc T610 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం 8 మెగాపిక్సెల్ బ్యాక్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ట్యాబ్  బ్యాటరీ 5500mAh ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 4జీ కనెక్టివిటీతో ఈ ట్యాబ్‌ను కంపెనీ విడుదల చేయనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News