Big Stories

Moto Foldable Smartphones: మాయ చేస్తున్న మోటో.. రెండు దమ్మున్న మడత ఫోన్లు.. ప్రపంచంలోనే ఇలా ఫస్ట్ టైమ్!

Motorola Launching Razr 50, Razr 50 Ultra Foldable Smartphones: మోటరోలా టెక్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. వరుస లాంచ్‌లతో మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే కంపెనీ తన రాబోయే ఫ్లిప్ ఫోన్  మోటరోలా Razr 50 సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Razr 50 సిరీస్ జూన్ 25న లాంచ్ అవుతుందని మోటరోలా Weiboలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ సిరీస్‌లో Motorola రెండు కొత్త ఫోన్‌లను చూడొచ్చు. అందులో Razr 50- Razr 50 Ultra ఉన్నాయి. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన 40 సిరీస్‌కు సక్సెసర్‌గా రేజర్ 50 సిరీస్‌ను లాంచ్ చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల ప్రత్యేక, ఫీచర్లు,స్పెసిఫికేషన్లు చూడండి.

- Advertisement -

Motorola Razor 50 స్మార్ట్‌ఫోన్ కొన్ని రోజుల క్రితం గీక్‌బెంచ్‌లో లిస్ట్ అయింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్‌లో మెడిటెక్ Dimension 7300x చిప్‌సెట్‌ ఉంటుంది. ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో రావచ్చు. ఫోన్‌లో మెయిన్ డిస్‌ప్లే 6.9 అంగుళాలు ఉంటుంది. ఈ OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా కంపెనీ ఫోన్‌లో 3.6 అంగుళాల OLED డిస్‌ప్లేను కూడా తీసుకొస్తుంది.

- Advertisement -

Also Read: న్యూ స్మార్ట్‌ఫోన్.. సరికొత్త డిస్కౌంట్.. తక్కువ ధరకే ఆటాడిస్తుంది!

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలతో ఉంటాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో  13-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. ఫోన్‌లో 4200mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

Razor 50 Ultra స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో రావచ్చు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇది. అయితే ఇందులో వెనిలా వేరియంట్ తక్కువ కెపాసిటీ వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 4000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 12 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు.

Also Read: ఒక్క రోజు మాత్రమే.. 3 లక్షల మంది కొన్న ఫోన్‌పై భారీ ఆఫర్.. దద్దరిల్లే డీల్!

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌‌లు ఉంటాయి. అదే సమయంలో మీరు సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూస్తారు. ఫోన్  డిస్‌ప్లే బేస్ వేరియంట్ సైజులో ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లను మొదట చైనాలో లాంచ్ చేయనుంది. కొన్ని రోజుల తర్వాత భారతదేశంతో పాటు ఇతర మార్కెట్లలోకి విడుదల కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News