Big Stories

Motorola G85 5G: మోటో నుంచి బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు!

Motorola G85 5G will be Launch Soon in India: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మొదట్లో ప్రీమియం మార్కెట్‌‌ని టార్గెట్ చేసుకొని గ్యాడ్జెట్లను తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా మోటో Motorola Razr 50 సిరీస్‌తో పాటు Moto S50 నియోను జూన్ 25 న మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా బడ్జెట్ ధరలో Motorola మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. గతకొన్ని రోజులుగా ఈ బడ్జెట్ ఫోన్‌పై టెక్‌ మార్కెట్లో వార్తలు వస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

- Advertisement -

Moto G85 5G యూరప్‌లో విడుదల చేసింది.  ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ అవుతుంది. Moto G85 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12 GB వరకు ర్యామ్‌తో వస్తుంది. ఇందులో డాల్బీ ఆడియోను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: దిమ్మతిరిగే డీల్.. iQOO 5G ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్!

Motorola G85 5G Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్2తో 1600 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీరు IP54 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో ఈ ఫోన్ డిస్‌ప్లేలో ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా చూడవచ్చు. ఫోన్ 12 GB RAM 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా ఫోన్‌లో Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ఉంటుంది.

మోటో ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలను అందిస్తోంది. వీటిలో 50-మెగాపిక్సెల్ OIS మెయిన్ లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా అల్ట్రావైడ్, మాక్రో డెప్త్ సెన్సార్‌గా కూడా పనిచేస్తుంది. ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది . ఈ బ్యాటరీ 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది.

Also Read: 200 MP కెమెరా.. అదిరిపోయిన రెడ్‌మీ కొత్త కలర్.. రూ.6 వేల డిస్కౌంట్..!

OS గురించి చెప్పాలంటే ఫోన్ Android 14 ఆధారంగా MyUXలో రన్ అవుతుంది. సౌండ్ కోసం ఫోన్‌లో డాల్బీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఇది కాకుండా మీరు ఫోన్‌లో డ్యూయల్ మైక్రోఫోన్, స్టీరియో స్పీకర్‌ను కూడా చూస్తారు. కనెక్టివిటీ కోసం, Motorola ఈ కొత్త ఫోన్‌లో 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 802.11 ac, GPS, USB టైప్-C, NFC వంటి పీచర్లు ఉన్నాయి. ఫోన్‌ బ్లూ, బ్లాక్, గ్రీన్ కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News