Big Stories

Moto G85 Smart Phone Launch: కొత్త ఆటగాడు రెడీ.. కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, స్నాపడ్రాగన్ ప్రాసెసర్‌తో మోటో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధరలోనా..?

Moto G85 Smartphone Launching on July 10: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో తన ఆదిపత్యాన్ని మరింత పెంచేందుకు సేఫ్టీ పరంగా కానీ, మరే ఇతర విషయాలలో అయినా కంపెనీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తమ మొబైల్‌లో అందిస్తుంది. ఇలా ఇప్పటికే పలు మోడళ్లలో టెక్నాలజీ పరంగా మార్పులు తీసుకొస్తూ కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు మరొక బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

- Advertisement -

Motorola 2024 సంవత్సరంలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కంపెనీకి చెందిన G సిరీస్‌లో కొత్త మిడ్-రేంజ్ ‘Moto G85’ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 10న లాంచ్ కానుంది. ఈ ఫోన్ గత వారం యూరప్‌లో కూడా విడుదలైంది. అక్కడ సూపర్ క్రేజ్ అందుకుంటుంది. దీంతో కంపెనీ Moto G85 టీజర్‌ను భారతదేశ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో షేర్ చేసింది. ఈ టీజర్ ప్రకారం.. కొత్త మోటో ఫోన్ అనేక కొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: 4 ఏళ్ల వారంటీతో మోటోరోలా నుంచి మ్యాజిక్ ఫోన్.. ఈ సారి మామూలుగా ఉండదు మరీ

Moto G85 యూరప్‌లో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. దీని గరిష్ట ప్రకాశం 1600 నిట్స్.. అలాగే టచ్ శాంప్లింగ్ రేట్ 360 Hzగా ఉన్నట్లు తెలుస్తోంది. Moto G85 వెనుక వైపున OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. అంతేకాకుండా Moto G85 Snapdragon 6s Gen 3 SoCని కలిగి ఉంటుంది.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో గరిష్టంగా 8GB లేదా 12GB RAMను అందించే అవకాశం ఉంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. ఇది 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు Motorola రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. Moto G85 వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిషింగ్‌ను అమర్చారు. ఇక దీని మిడ్ రేంజ్ వేరియంట్ ధర విషయానికొస్తే.. ఇది రూ.19,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: iQoo Neo 9s Pro+: పవర్ ప్యాక్డ్ ఫోన్ లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ అబ్బ..

ఈ ఫోన్ IP52 రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. అంటే నీరు, దుమ్ము నుంచి ఫోన్‌ను కొంత వరకు సురక్షితంగా కాపాడుతుంది. కొత్త మోటో ఫోన్ కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులోకి రానుంది. ఇది 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. జూలై 10న భారతదేశంలో లాంచ్ కానున్న Moto G85ని ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News