Big Stories

ChatGPT:- ప్రభుత్వ రంగంలో చాట్‌జీపీటీ.. ఆ దేశంలో మొదటిసారి..

ChatGPT:- ఈరోజుల్లో మనుషుల కంటే మెషీన్ సామర్థ్యం ఎక్కువగా ఉంది నమ్మేవారు చాలామంది ఉంటారు. అందుకే మెషీన్ లోని పూర్తిస్థాయి సామర్థ్యాన్ని బయటికి తీయడం కోసం శాస్త్రవేత్తలు ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీ అనే ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పుడు పాత సమస్యలకు కొత్త సమాధానం లాగా చాట్‌జీపీటీ అందరికీ ఉపయోగపడుతుంది. చాట్‌జీపీటీ సాయంతో ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయని ఒక కొత్త ప్రయత్నాన్ని జపాన్ చేసింది.

- Advertisement -

జపాన్‌లోని యోకోసుకా.. తన నేవీ బేస్‌కు ఫేమస్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడు ప్రపంచంలోనే చాట్‌జీపీటీని స్వీకరించిన మొట్టమొదటి మునిసిపాలిటీగా యోకోసుకా రికార్డ్ సాధించింది. చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో మునిసిపాలిటీలో కలుపుకునే ముందు 4 వేల ఉద్యోగులతో దీనిపై ప్రయోగాలు చేపట్టారు. వీరందరూ చాట్‌జీపీటీతో కలిసి తమ రోజూవారి పనులను పూర్తి చేయడం, టాస్కులను పూర్తి చేయడం చేస్తూ చాట్‌జీపీటీని అలవాటు చేసుకున్నారు.

- Advertisement -

మునిసిపాలిటీలోనే కాదు ఇంకా ఇతర రంగాల్లోని టాస్కులను పూర్తిచేయడానికి కూడా జపాన్ చాట్‌జీపీటీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సన్నాహాలు చేస్తోంది. అందులోనూ ముఖ్యంగా యోకోసుకా ఇప్పటికే ఈ విషయంపై ప్లానింగ్ కూడా మొదలుపెట్టింది. ఇటీవల ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ జపాన్ పర్యటనకు వెళ్లారు, ప్రధాన మంత్రితో సమావేశమయ్యారు. ఆ తర్వాత యోకోసుకా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో విధాలుగా చాట్‌జీపీటీ ఉపయోగపడుతోంది. కానీ ఒక ప్రభుత్వ రంగంలో చాట్‌జీపీటీని పూర్తిస్థాయిలో ఉపయోగించడం అనేది జపానే ప్రారంభించింది. ఒకవైపు చాట్‌జీపీటీకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ ముందుకెళ్తున్నాయి. కానీ మానవ మేధస్సు కంటే ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీ అనేది చాలా అడ్వాన్స్‌గా పనిచేస్తుంది అనే నిజాన్ని మాత్రం చాలామంది ఒప్పుకోవాల్సిందే అని పలువురు శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని గర్వంగా చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News