Big Stories

IQOO Z9 Turbo Smartphone: ఆహా ఏముంది.. ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అరాచకం మావ..!

iQoo Z9 Turbo Launch: Z9, Z9 టర్బో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌లు ప్రాసెసర్‌లు ఉన్నాయి. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి వచ్చిన కొత్త లీక్ ప్రకారం ఐక్యూ Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. లీక్‌లో ఫోన్ ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. ఒక టెక్ బ్లాగర్ ఈ ఫోన్ ప్రాసెసర్‌ను వెల్లడించారు.

- Advertisement -

ఐక్యూ ఈ ఫోన్ డైమెన్షన్ 9300+ చిప్‌సెట్‌తో వస్తుందని బ్లాగర్ తెలిపారు. ఫోన్ ఫీచర్ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రాసెసర్ కాకుండా దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు Z9 Turbo మాదిరిగానే ఉంటాయి. Z9 Turbo ఫీచర్లు విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది.

- Advertisement -

ఈ డిస్‌ప్లే 4500 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో 144Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్ 16 GB వరకు RAM + 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో Snapdragon 8s Gen 3ని తీసుకొచ్చింది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొచ్చింది.

Also Read: కత్తిలాంటి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. చుక్కలు చూపిస్తుంది!

ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫోన్ ముందు కెమెరా 16 మెగాపిక్సెల్స్. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అందించారు. ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ IP64 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. OS విషయానికొస్తే ఫోన్ Android 14 ఆధారంగా OriginOS 4లో రన్ అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News