Big Stories

iQOO Cheapest Entry Level Phone: సూపర్ ఫీచర్స్.. ఐక్యూ నుంచి మొదటి బడ్జెట్ ఫోన్.. ఇది టేమ్టింగ్ రేటు బ్రో..!

Cheapest Entry Level iQOO Phone Launching on June 27th: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ ఐక్యూ మంచి జోషు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ దేశంలో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక ఇప్పుడు మరో కొత్త గ్యాడ్జెట్​ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ iQOO Z9 Liteని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలైలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందు కంపెనీ మిడ్-రేంజ్, ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు కంపెనీ బడ్జెట్ లెవల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించబోతోంది. ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

లీక్ ప్రకారం iQOO Z9 లైట్ బ్రౌన్, బ్లూ కలర్స్‌లో వస్తుంది. జూలై మధ్యలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇతర వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo T3 లైట్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ జూన్ 27 న లాంచ్ కానుంది. ఇది కంపెనీ అత్యంత చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.

- Advertisement -

Also Read: ఐఫోన్ 15పై భారీ డీల్ బ్రో.. అస్సలు వదలొద్దు!

iQOO Z9 Lite ధర విషయానికి వస్తే iQOO లైనప్‌లో ఇప్పటి వరకు iQOO Z9, iQOO Z9x స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ రెండూ రూ. 20,000 లోపు ధరలో ఉండవచ్చని అంచనా. రాబోయేది ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి iQOO Z9 Lite ధర దాదాపు రూ. 12,000 లేదా అంతకంటే తక్కువగా ఉండవచ్చు. iQOO Z9 Lite స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.

అంతేకాకుండా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ AI కెమెరా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సెకండరీ సెన్సార్‌ కూడా ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ను ఇంతకు ముందు అనేక స్మార్ట్‌ఫోన్‌లలో అందించారు. అందులో రియల్‌‌మీ నార్జో N65, C65 వంటి బడ్టెట్ 5G  ఫోన్‌లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 11,499, రూ. 10,499 నుండి ప్రారంభమవుతాయి.

Also Read: వన్‌ప్లస్ బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.. సేల్ ఎప్పుడంటే?

Vivo T3 ఫీచర్ల గురించి మాట్లాడితే Vivo T3లో MediaTek Dimensity 7200 SoC ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Vivo T3 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 6.67-అంగుళాల 120Hz ఫుల్ HD+ AMOLED స్క్రీన్ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్. 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 21,999 నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News