Big Stories

IQOO Z9 Lite 5G: హిట్ అయ్యే ఫోన్ ఇది.. ఐక్యూ బడ్జెట్ ఫోన్.. డబ్బులు రెడీ చేస్కోండి!

IQOO Z9 Lite 5G: టెక్ మేకర్ IQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనుంది. ఈ మేరకు జులై 15 న ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫోన్ డిజైన్ కూడా టీజ్ చేసింది. దీని ప్రకారం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లు కలిగి ఉంటుంది. iQOO Z9 Lite 5Gలో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ 6 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. AnTuTu 10లో iQOO Z9 Lite 5G 4.14 లక్షల పాయింట్లను స్కోర్ చేసిందని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 900 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ డిస్‌ప్లే మంచి స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తోంది. ఈ 5G ఫోన్‌లో MediaTek Dimensity 6300 SoC చిప్‌సెట్ ఉంటుంది.

- Advertisement -

Also Read: గెట్ రెడీ.. తక్కువ ధరకే 5G ఫోన్లు.. మనందరికోసమే!

ఈ చిప్‌సెట్ బెటర్ పర్ఫామెన్స్ అందిస్తోంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా IQOO Z9 లైట్ 5G ఫోన్ లాంచ్ అవుతుంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు,సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. iQOO Z9 Lite 5G ఫోన్ భారతదేశంలో జూలై 15న రూ.10,000 ధరతో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo T3 Lite 5G ఫోన్  రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఇది ఇటీవల రూ. 10,499 ధరతో విడులైంది.

iQOO Z9 Lite 5G ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 4GB RAM + 128GB, 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ స్టోరేజ్ పెంచుకునేందుకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో OIS మద్దతుతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరాతో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Also Read: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

ఇది కాకుండా LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్లు సమాచారం. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కాబట్టి ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ ఛార్జర్ ఉంది. కాబట్టి ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఫోన్‌లో 5G, GPS, Wi-Fi, USB టైప్-సి పోర్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News