Big Stories

iPhone 15 Discount Offer: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ డీల్ బ్రో.. అస్సలు వదలొద్దు!

Huge Discount on iPhone 15 Series: యాపిల్ ఐఫోన్ కొనాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఆ బ్రాండ్‌కు ఉన్న పాపులారిటీ, వాటిలో ఉండే ఫీచర్లు మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ ఐఫోన్ల ధరల కారణంగా చాలా మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో యాపిల్ iPhone 15 స్మార్ట్‌ఫోన్ బంపర్ తగ్గింపుతో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొంత కాలంగా ఐఫోన్లపై ఎక్కువగా ఆఫర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ధరలు తరచూ మారుతూ ఉంటాయి. అలానే డీల్‌లు అన్ని సమయాలలో ఒకేలా ఉండవు. అదే సమయంలో మీరు కూడా స్టాండర్డ్ iPhone 15 లేదా iPhone 15 Plus కొనుగోలు చేయాలని చేస్తున్నట్లయితే అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకోండి.

- Advertisement -

Apple AIని ఫీచర్లను చూడాలంటే iPhone 15 Pro మోడల్‌ని కొనుగోలు చేయాలి. ఇందులో లేటెస్ట్ అప్‌డేట్‌లతో కూడిన AI టూల్స్ ఉంటాయి. అంతే కాకుండా ఈ జాబితాలో 15 ప్రో, ప్రో మాక్స్ మాత్రమే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 16 సిరీస్ సాధారణ మోడల్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ఫీచర్లను పూర్తి స్థాయిలో అనుభవించాలంటే ఫోన్‌లో కనీసం 8GB RAM అవసరం ఉంటుంది. ప్రస్తుత నాన్-ప్రో ఐఫోన్ 15 మోడల్‌లలో 6GB RAM ఉంది. 2024 ఐఫోన్‌ల‌లో 8 వరకు ర్యామ్ ఇవ్వనున్నారు. కాబట్టి తర్వాత జనరేషన్ గ్యాడ్జెట్లు Apple నుండి AI అప్‌డేట్‌లను పొందుతాయి. అందువల్ల Apple AIని ఆస్వాదించాలనుకునే వారు iPhone 15 లేదా Plus మోడల్‌లను కొనుగోలు చేయకుండా ఉండాలి.

Also Read: బంపర్ ఆఫర్.. వివో 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

ఐఫోన్ 15ఆఫర్ల విషయానికి వస్తే విజయ్ సేల్స్, అమెజాన్, క్రోమా వంటి ప్లాట్‌ఫామ్‌లో ఐఫోన్ 15 తగ్గింపు ధరకు సేల్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం iPhone 15 బేస్ వేరియంట్ రూ. 8,610 భారీ డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి మీరు దీన్ని విజయ్ సేల్స్ ద్వారా రూ.71,290కి కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనంగా రూ. 6,000 తగ్గింపు కూడా పొందొచ్చు.

iPhone 15 60 Hz రిఫ్రెష్ రేట్ 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. Apple iPhone 15 హెక్సా-కోర్ Apple A16 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కెమెరాల విషయానికొస్తే 48-మెగాపిక్సెల్ (f/1.6) ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ (f/2.4) కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Also Read: చాలా మంచి ఆఫర్స్.. తక్కువ ధరకే ఐఫోన్, వన్‌ప్లస్‌ ఫోన్లు..!

సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను ఉంది. f/1.9 ఎపర్చర్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 128GB, 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. డ్యూయల్ నానో సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ, గ్రీన్, రోస్, ఎల్లో కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. ఇది  IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11 b/g/n/ac/ax, GPS, బ్లూటూత్ v5.30, NFC, USB టైప్-C, 3G, 4G ఉన్నాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News