Big Stories

Infinix Note 40 5G Sale Offer: 108MP కెమెరా ‘ఇన్‌ఫినిక్స్ నోట్ 40’ ఫోన్ సేల్ స్టార్ట్.. ఈ ఆఫర్లు భలేగున్నాయ్!

Infinix Note 40 5G First Sale Offer: టెక్ బ్రాండ్ ఇన్ఫిక్స్ ఇటీవల Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జరుగుతోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు దీనిని మంచి ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. మిడ్ రేంజ్ ఫోన్ అతిపెద్ద ఫీచర్లలో MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఒకటి. Infinix Note 40 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7020 చిప్‌సెట్ ఇందులో అందుబాటులో ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ను అమర్చారు. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం..

- Advertisement -

భారతదేశంలో Infinix Note 40 5G ఫోన్ ధర, ఆఫర్ల విషయానికొస్తే.. Infinix Note 40 5G ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లాంచ్ చేయబడింది. ఈ వేరియంట్ రూ.19,999 ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది.

- Advertisement -

ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అటువంటి సమయంలో Infinix తన నోట్ 40 5G కొనుగోలుదారులకు Infinix MagPad వైర్‌లెస్ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇది కాకుండా.. HDFC, Axis, ICICI, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా అదనంగా రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందుతారు. అప్పుడు మరింత తక్కువకే దీనిని కొనుక్కోవచ్చు.

Also Read: గట్టిగా పట్టెయ్.. కొత్త ఫోన్ లాంచ్.. అమేజింగ్ ఆఫర్లు!

Infinix Note 40 5G Specifications

Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో FullHD ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. దీని గరిష్ట ప్రకాశం 1300 నిట్‌లు.. అలాగే PWM డిమ్మింగ్ 2160Hzను కలిగి ఉంది. ఇది కళ్లపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

Infinix Note 40 5Gలో MediaTek డైమెన్షన్ 7020 ప్రాసెసర్ ఉంది. ఇది 8GB LPDDR4X RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 15W వైర్‌లెస్ MagSafe ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కొత్త Infinix ఫోన్ సరికొత్త Android 14లో రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంది. ముందు భాగంలో 32 MP కెమెరా అందించబడింది. స్టీరియో స్పీకర్‌లు JBL సౌండ్‌ని కలిగి ఉంటాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News