Big Stories

Honor Magic 6 Pro Mobile: నమ్మలేకపోతున్నా బ్రో.. 180MP కెమెరా, 1TB స్టోరేజ్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. పిచ్చెక్కించే ఫీచర్లు!

Honor Magic 6 Pro Confirmed to Launch in India Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. మార్కెట్‌లో ఇతర ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల చైనాలో హానర్ మ్యాజిక్ 6 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు హానర్ మ్యాజిక్ 6 ప్రోని త్వరలో భారతదేశంలో కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ జూలైలో భారత మార్కెట్లోకి రావచ్చు. ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ.. కొన్ని ఫీచర్లు తెలిసాయి.
హానర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకపు కంపెనీ CEO మాధవ్ షెత్ సోషల్ మీడియాలో ఈ కొత్త ఫోన్ డీటెయిల్స్ పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ ప్రకారం.. కంపెనీ త్వరలో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయబోతోందని సూచిస్తుంది. అతను Honor Magic 6 Ultimate, Porsche Design Magic 6 RSR చిత్రాలను కూడా పోస్ట్ చేసాడు. ఈ ఫోన్‌లను భారతదేశంలో కూడా లాంచ్ చేయవచ్చని సమాచారం. అంతేకాకుండా అతను ఇటీవల భారతదేశంలోకి హానర్ మ్యాజిక్ V2 ఫోల్డబుల్ ఫోన్ రాక గురించి కూడా వెల్లడించాడు.

Honor Magic 6 Pro సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 1TB స్టోరేజ్, 16GB వరకు RAMతో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఇప్పటికే ఐరోపాలో అందుబాటులో ఉంది. భారతదేశంలో కూడా ఇదే విధమైన వేరియంట్ లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్‌గా Android 14 ఆధారిత Honor MagicOS 8ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

ఐరోపాలో లాంచ్ అయిన హానర్ మ్యాజిక్ 6 ప్రో 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే పూర్తి HD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్ప్లేలో నానోక్రిస్టల్ షీల్డ్ కూడా ఉండవచ్చు. ఈ షీల్డ్ గతంలో ఉపయోగించిన షీల్డ్‌ల కంటే డ్రాప్స్‌కి వ్యతిరేకంగా 10 రెట్లు బలంగా ఉందని హానర్ పేర్కొంది. మ్యాజిక్ 6 ప్రో గ్లాస్‌లో సిలికాన్ నైట్రైడ్ కోటింగ్ కూడా ఉంది. తద్వారా స్క్రీన్ సులభంగా గీతలు పడదు.

- Advertisement -

Also Read: ధూమ్ ధమాకా ఆఫర్.. రూ.703లకే 6GB RAM 5జీ ఫోన్.. మొన్ననే లాంచ్.. అప్పుడే అత్యంత చౌక ధరలో దొరికేస్తోంది..!

ఈ ఫోన్‌లో మూడు వెనుక కెమెరాలు ఉంటాయని ఊహిస్తున్నారు. 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 180MP పెరిస్కోప్ లెన్స్ ఇది 2.5 రెట్లు జూమ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 5,600mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనా, బార్సిలోనా, స్పెయిన్‌లలో ప్రారంభించబడింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, కెమెరా, బ్యాటరీ లైఫ్ చూసి నెటిజన్లు నమ్మలేకపోతున్నాం బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News