Big Stories

Honor X6b: బడ్జెట్ ప్రియుల కోసం మార్కెట్‌లోకి కొత్త ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు..!

Honor X6b: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా Honor X6b 4g స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సడెన్‌గా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ హానర్ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. ఇది ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్న సరసమైన స్మార్ట్‌ఫోన్. 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. TFT LCD ప్యానెల్‌తో వచ్చింది. దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వబడింది. ఫోన్ 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

- Advertisement -

దీనితో పాటు 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఫోన్ Android 14 ఆధారిత MagicOS 8.0 పై రన్ అవుతుంది. Honor X6b ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ అనేక షేడ్స్‌లో పరిచయం చేయబడింది. ఇందులో ఫారెస్ట్ గ్రీన్, స్టార్రి పర్పుల్, ఓషన్ సియాన్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి ఆప్షన్‌లు ఉన్నాయి.

- Advertisement -

Honor X6b Specifications

Also Read: నమ్మలేకపోతున్నా బ్రో.. 180MP కెమెరా, 1TB స్టోరేజ్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. పిచ్చెక్కించే ఫీచర్లు!

Honor X6b ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది TFT LCD ప్యానెల్‌తో వచ్చింది. దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఈ ఫోన్ MediaTek Helio G85 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB, 6GB ర్యామ్.. 128GB, 256GB స్టోరేజ్ స్పెస్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.. కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించబడింది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్ కూడా ఉంది. ఫోన్ Android 14 ఆధారిత MagicOS 8.0 పై రన్ అవుతుంది. ఇది 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో పాటు 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఫ్రంట్ డిజైన్ చూస్తే వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇది మ్యాజిక్ క్యాప్సూల్ ఫీచర్‌తో అమర్చబడింది. ఇందులో ముఖ్యమైన యాప్‌లను నేరుగా నాచ్ చుట్టూ యాక్సెస్ చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News