Big Stories

Honor 200 Pro Launch: ఉఫ్.. చెమటలు పట్టిస్తున్న హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్.. మరే ఫోన్లు వద్దంటారేమో!

Honor 200 Pro Launch Soon in India: స్మార్ట్‌ఫోన్లపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడంతో ప్రముఖ కంపెనీలు తరచూ కొత్త కొత్త మోడళ్లను వారికి పరిచయం చేసే పనిలోనే పడ్డారు. ఇందులో భాగంగానే వారి టేస్ట్‌కు తగ్గట్టుగా కెమెరా, బ్యాటరీ, సేఫ్టీతో అనేక ఫీచర్లను ఫోన్లలో అందిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. అందులో హానర్ కంపెనీ కూడా ఒకటి.

- Advertisement -

హానర్ కంపెనీ ఇటీవల హానర్ 200 సిరీస్‌ను చైనాలో ప్రారంభించింది. అలాగే పారిస్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమం తర్వాత ప్రపంచవ్యాప్తంగా తమ ఫోన్ల సేల్‌ను ప్రారంభించింది. ఈ ఫోన్‌లు త్వరలో భారత్‌కు రానున్నాయని.. వాటిని అమెజాన్‌లో కొనుక్కోవచ్చని కంపెనీ తెలిపింది. అందులో ఈ Honor 200 Pro ఇప్పుడు BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇందులో భాగంగానే ఈ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

- Advertisement -

Honor 200 Pro ఫోన్ భారతదేశంలో త్వరలో లాంచ్ కాబోతోంది. BIS సర్టిఫికేషన్ (Bureau of Indian Standards) పొందిన తర్వాత ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ప్రో మోడల్ మాత్రమే ఈ సర్టిఫికేషన్ పొందింది. అయితే రెగ్యులర్ హానర్ 200 ఫోన్ కూడా త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Also Read: ఎక్కెక్కి ఏడ్చినా ఇలాంటి ఫోన్ దొరకదు.. 16GB RAM, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!

Honor 200 Pro Specifications:

Honor 200 Pro స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది చాలా అందంగా, స్మూత్‌గా కనిపిస్తుంది. అలాగే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. అంటే స్క్రీన్‌పై ఏవైనా విషయాలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే ఈ స్క్రీన్ 3840Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఇది కంటిపై పడే అధిక ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాని బ్రైట్‌నెస్ 4000నిట్‌ల వరకు ఉంటుంది. అంటే సూర్యకాంతిలో కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది.

అంతేకాకుండా Qualcomm Snapdragon 8s Gen 3 వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం అడ్రినో GPU కూడా అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. హానర్ 200 ప్రోలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వంటి మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.

Also Read: Vivo T3 Lite 5G Launched in India: ఫొటో అట్రాక్షన్ ఫోన్.. వివో నుంచి రూ.9999లకే కొత్త 5జీ మొబైల్.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

ఈ మూడు కెమెరాలు హెచ్‌డీ ఫొటోలను తీస్తాయి. అలాగే సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక హానర్ 200 ప్రో బ్యాటరీ విషయానికొస్తే.. Honor 200 Pro స్మార్ట్‌ఫోన్‌లో 5200mAh శక్తివంతమైన బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్ 100W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా ఫుల్ అవుతుంది. ఇది కాకుండా 66W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా మద్దతు ఇస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని అవసరాలను కలిగి ఉంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించబడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News