Big Stories

Honey Bee:కనుమరుగవుతున్న తేనెటీగలు.. పరిశోధకుల్లో ఆందోళన..

Honey Bee:పువ్వులు, పక్షులు లాంటి ప్రాణులు ప్రశాంతంగా జీవిస్తేనే.. భూమిపై ఇతర ప్రాణులు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాణి చేసే పనిలో కాస్త మార్పు వచ్చినా.. అది ఇతర ప్రాణుల జీవితాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో తేనెటీగలు ఎక్కువగా కనిపించకపోడం అక్కడి ప్రజలను కష్టాల్లోకి తోస్తుందేమోనని పరిశోధకులు భావిస్తున్నారు.

- Advertisement -

ఒక పువ్వు నుండి మరో పువ్వు పుట్టే ప్రక్రియనే పాలినేషన్ అంటారు. పాలినేషన్ అనేది చెట్ల, పువ్వుల సంఖ్యను పెంచడానికి తోడ్పడుతుంది. తేనెటీగలు కూడా దీనికి ఎంతో తోడ్పడతాయి. పాలినేషన్ ద్వారా తినే ఆహార పదార్థాలు కూడా ఉత్పత్తవుతాయి. అమెరికాలో దాదాపు మూడువంతుల ఆహారం ఇలాగే ఉత్పత్తవుతుంది. కానీ అమెరికాలో 2019 ఏప్రిల్ నుండి 2020 ఏప్రిల్ వరకు దాదాపు 43 శాతం తేనెటీగలు ప్రాణాలు కోల్పోయాయని స్టడీలో తేలింది. దీని వల్ల పాలినేషన్‌పై తీవ్ర ప్రభావం పడింది.

- Advertisement -

తేనెటీగలు, పక్షులు లాంటివి వాతావరణ మార్పులపై కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే గత అయిదేళ్లుగా అమెరికాలో తేనెటీగలు ఎక్కువగా చనిపోవడానికి వాతావరణ మార్పులు, పెస్టిసైడ్స్, ఇతర పురుగులు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే తేనెటీగలు చనిపోవడానికి రక్షించే బాధ్యత ఉందని వారు తెలిపారు. అంతే కాకుండా వాటిని బతికించడానికి వీలైన ప్రయత్నాలు చేయాలని వారు పిలుపునిచ్చారు.

అమెరికాలోని దాదాపు 100కు పైగా ఆహార పదార్థాల ఉత్పత్తికి తేనెటీగలు పాలినేటర్స్‌గా వ్యవహరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే ఒకేసారిగా అవన్నీ చనిపోతుంటే ఎలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మామూలుగా ఒక్కొక్క ప్రాంతంలో తేనెటీగలు చనిపోవడానికి ఒక్కొక్క కారణముంటుందని, కానీ మొత్తంగా అవి ఎక్కువ సంఖ్యలో చనిపోవడానికి కారణమేంటో వారు కనిపెడతామని హామీ ఇచ్చారు.

పరిశోధకులు, శాస్త్రవేత్తలు, జియెగ్రాఫర్స్‌తో కలిసిన ఒక టీమ్ 2015 నుండి 2021 వరకు తేనెటీగల గురించి పూర్తిగా స్టడీ చేశారు. అసలు అవి ఎలాంటి పర్యావరణంలో బతుకుతుంటాయి అని ఎన్నో కోణాల్లో పరిశోధనలు చేశారు. దీని ద్వారా వారికి తేనెటీగల గురించి చాలా సమాచారం లభించింది. అప్పుడే తేనెటీగలతో పాటు నివసించే ఇతర ప్యారసైట్లు వాటి ఆరోగ్యం మీద ప్రభావం చూపించి, మెల్లగా వాటిని వైరస్ బారిన పడేలా చేస్తాయని వారు గుర్తించారు.

తేనెటీగలు ఎక్కువగా జనవరి నుండి మార్చ్ మధ్య చనిపోతుండడంతో ఎక్కువ చలి వల్ల కూడా ఇవి చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే బీస్‌ను కాపాడుకోవడానికి బీకీపర్స్‌ కూడా తమవంతు ప్రయత్నాలు చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. తేనెటీగలకు ఎక్కువగా ఆహారం ఉన్న చోటికి వాటిని తరలించడం, పెస్టిసైడ్స్ నుండి వాటిని కాపాడడం, వాతావరణ మార్పుల నుండి వాటిని కాపాడడం.. ఇవన్నీ బీకీపర్స్ బాధ్యత అని వారు అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News