Big Stories

HMD Ridge Pro Launch: రప్ఫాడించారు.. HMD నుండి మరో బడ్జెట్ ఫోన్.. పక్కా బ్లాక్‌బస్టర్..!

HMD Ridge Pro Launch: నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD కొత్త ఫోన్‌లను వరుసగా మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఇటీవలే కంపెనీ హెచ్‌ఎమ్‌డీ స్కైలైన్, హెచ్‌ఎమ్‌డీ అట్లాస్‌, హెచ్‌ఎమ్‌డీ రిడ్జ్ ఫోన్లను తీసుకొచ్చింది. అయితే తాజాగా హెచ్ఎమ్‌డీ రిడ్జ్ ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెయిన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ లీకైన అప్‌డేట్‌ల ప్రకారం ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

టిప్‌స్టర్ HMD_MEME’S సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడించారు. దీని ప్రకారం ఫోన్‌లో మూడు కెమెరా రింగ్‌లు ఉంటాయి. ఇది LED లైట్‌తో ప్లెయిన్ బ్యాక్‌ కలిగి ఉంది. స్పెక్స్ పరంగా రిడ్జ్ ప్రో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.64-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read: వీళ్లు తెగించారు..108 MP కెమెరాతో ఇన్ఫినిక్స్ ఆల్ రౌండర్ ఫోన్.. పూనకాలు రావాల్సిందే!

హెచ్ఎమ్‌డీ రిడ్జ్ ప్రో లీక్‌ల ప్రకారం ఫోన్ Qualcomm బడ్జెట్-ఆధారిత చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇది మైక్రో SD ద్వారా 6GB, 8GB RAM+ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సిస్టమ్ 50MP మెయిన్ సెన్సార్, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా  సెన్సార్‌గా ఉంటుంది.

ఇది కాకుండా హెచ్ఎమ్‌డీ రిడ్జ్ ప్రో ఫోన్‌లో 5,500mAh పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉందని టిప్‌స్టర్ వెల్లడించారు. అంతే కాకుండా ఫోన్‌లో 5G కనెక్టివిటీ సపోర్ట్, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

Also Read: దిమాక్ కరాబ్ డీల్స్.. ఐఫోన్, సామ్‌సంగ్ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్స్.. కొంటే ఇప్పుడే కొను!

కంపెనీ ఈ ఫోన్‌ను మోచా, స్నో, గ్లేసియర్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, లాంచ్ తేదీ వంటి అధికారిక వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే దాని స్పెక్స్ ఆధారంగా రిడ్జ్ ప్రో బడ్జెట్ సెగ్మెంట్‌లో రానుంది. లాంచ్ వివరాలతో సహా మరింత సమాచారం జులైలో జరిగే గ్లోబల్ రిలీజ్‌లోపు అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News