Big Stories

HMD Introduced Nokia 4G Feature Phones: రూ. 3999కే కొత్త 4జీ ఫీచర్ ఫోన్లు లాంచ్.. యూట్యూబ్, యూపీఐ యాప్‌లకు సపోర్ట్ కూడా..!

HMD Introduced Nokia 3210, 235, and 220 4G Feature Phones with Rs 3,999: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ HMD కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా HMD గ్లోబల్ Nokia 3210 ఫీచర్డ్ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఈ ఫోన్‌ను కొత్త కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేయబడింది. ఇక ఈ ఫోన్‌తో పాటు Nokia 235 4G, Nokia 220 4G ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి.

- Advertisement -

ఈ ఫోన్ల స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫీచర్ ఫోన్‌లలో ఇన్‌బిల్ట్ UPI (యూపీఐ చెల్లింపుకు మద్దతు)తో పాటు యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ క్లౌడ్ వంటి యాప్‌లు, కెమెరా, క్లాసిక్ స్నేక్ గేమ్ వంటి ఫీచర్‌లతో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుదాం. భారతదేశంలో HMD గ్లోబల్ Nokia 3210, Nokia 235 4G, Nokia 220 4G ధర విషయానికొస్తే.. కంపెనీ Nokia 3210 ఫోన్‌ని కేవలం రూ.3,999 ధరకు విడుదల చేసింది. అలాగే Nokia 235 4జీ ఫోన్ ధర రూ.3,749గా ఉంది. ఇక Nokia 220 4జీ ఫోన్ ధరను కంపెనీ రూ.3,249గా నిర్ణయించింది.

- Advertisement -

ఈ ఫోన్లను HMD అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Amazonలో కొనుక్కోవచ్చు. ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. Nokia 3210 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Unisoc T107లో పని చేస్తుంది. దీనిలో 128MB స్టోరేజ్ ఉంటుంది. ఇక మైక్రో SD కార్డ్ ఉపయోగించి 32GB వరకు ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్‌లో 2MP బ్యాక్ కెమెరా ఉంది. దీంతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ కూడా వస్తుంది.

Also Read: 25 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అదరగొడుతున్న నోకియా 3210..బెస్ట్ ఫీచ‌ర్లు ఇవే

కాగా ఈ ఫోన్ 1450mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 9.8 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. నోకియా 3210 ఫోన్‌లో యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, వెదర్, న్యూస్, క్రికిట్ స్కోర్ వంటి యాప్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది USB టైప్-సి సపోర్ట్‌ను కలిగి ఉంది. కాగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు YouTube Musicకు సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

ఇక Nokia 235 4G, Nokia 220 4G ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 235 4G ఫోన్ 2.8 అంగుళాల IPS డిస్ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ 2MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు.. నోకియా 220 4G ఫోన్ 2.8 అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో UPI యాప్‌ని పొందుతారు. దీని ద్వారా మీరు ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో పీచ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News