Big Stories

Google Pixel 8 Price Drop: ఏంది భయ్యా ఇలా తగ్గించేసారు.. Pixel 8పై ఇంత భారీ తగ్గింపా.. ఇది నేనేడా సూడలే!

Google Pixel 8 Price Dropped: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన మొబైల్ తయారీ కంపెనీల్లో గూగుల్ ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్లు చాలా ఖరీదు కలిగి ఉంటాయి. అదే సమయంలో దాని ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే ఇటీవల గూగుల్ తన లైనప్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. అయితే లాంచ్ సమయంలో ఈ ఫోన్ భారీ ధరను కలిగి ఉంది. అలాంటి సమయంలో ఈ ఫోన్‌ను కొనుక్కోవాలనుకున్న వారు తమ ప్లాన్‌ను మార్చుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి గుడ్ న్యూస్. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందులోబాటులో ఉంది.

- Advertisement -

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ భారీ ధర తగ్గింపును పొందింది. దీనితో మొబైల్ ధర రూ.55,000 కంటే తక్కువగా ఉంది. Pixel 8 భారతదేశంలో 8GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.75,999 ధరతో ప్రారంభించబడింది. అదే సమయంలో టాప్-ఎండ్ 8GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.82,999 ధరతో లాంచ్ అయింది.

- Advertisement -

అయితే Flipkartలో Pixel 8 128GB వేరియంట్ ధర రూ.61,999కి తగ్గింది. అంతేకాకుండా ఇ-కామర్స్ దిగ్గజం ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ.8,000 తక్షణ బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఈ భారీ తగ్గింపులో పిక్సెల్ 8 ధర రూ.53,999కి తగ్గింది.

Also Read: గూగుల్ నుంచి మేక్ ఇన్ ఇండియా ఫోన్లు.. ధరలు భారీగా తగ్గే ఛాన్స్..!

Google Pixel 8 Specifications:

Google Pixel 8 120Hz రిఫ్రెష్ రేట్, 428 ppi పిక్సెల్ డెన్సిటీతో 6.2-అంగుళాల యాక్చువల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Pixel 8 స్క్రీన్ 2000 నిట్స్ గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. Google Pixel 8 బలమైన కెమెరా పనితీరును అందిస్తుంది. ఇందులో 50MP PD వైడ్ ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10.5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,575mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, దుమ్ము – నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను పొందింది.

Pixel 8 Tensor G3 ప్రాసెసర్‌పై నడుస్తుంది. దాని ముందున్న Tensor G2తో పోల్చితే వేగం, మెరుగైన సామర్థ్యం రెండింటినీ అందిస్తుంది. ఇది 8GB RAMతో వస్తుంది.. 256GB వరకు స్టోరేజ్ ఎంపికలను అందిస్తుంది. Google Pixel 8 సరికొత్త Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రీలోడ్ చేయబడింది. గూగుల్ తన సాఫ్ట్‌వేర్ మద్దతును గణనీయంగా విస్తరించింది. ఏడు సంవత్సరాల వరకు సెక్యురిటీ ప్యాచ్‌లు, ప్రధాన Android OS అప్‌డేట్‌లను అందించడానికి కట్టుబడి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News