Big Stories

Offer iPhone 14 Plus: సగం ధరకే ఐఫోన్ 14 ప్లస్.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు భయ్యా!

Buy iPhone 14 Plus at Half Price: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ నుంచి మార్కెట్‌లోకి వచ్చే ప్రతి ప్రొడక్ట్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. అందులో ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేెదు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకునేవారు ఎందరో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐఫోన్ కొనాలనుకొనే వారికి అదిరిపోయే న్యూస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. దీన్ని అస్సలు మిస్ చేయకండి. డైరెక్ట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, కంపెనీ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Apple iPhone 14 Plus రూ. 89,900 ప్రారంభ ధరతో 2022లో భారతదేశంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌‌కార్ట్ దీనిపై భారీ తగ్గింపు అందిస్తోంది. దీంతో మీరు రూ. 57,999 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 55,999 (128GB) వద్ద అందుబాటులో ఉంది. 256GB, 512GB వేరియంట్‌లు రూ. 65,999, రూ. 85,999కి అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Also Read: ఏముంది దొర.. వివో నుంచి కొత్త 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..!

అంతేకాకుండా ఫోన్‌పై రూ. 23,901 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. మీకు HDFC బ్యాంక్ కార్డ్ ఉంటే మీరు రూ. 4,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ. 51,999కి తగ్గుతుంది. ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ మీరు పాత ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 వంటి వాటిపై రూ. 26,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది. మంచి కండిషన్ ఉన్న ఐఫోన్ 13 రూ. 26,000 పూర్తి తగ్గింపును పొందవచ్చు. వీటిని ఆరు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. రెడ్, బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, ఎల్లో. అయితే మూడు స్టోరేజ్ వేరియంట్లు అన్ని కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి.

iPhone 14 Plus Features
ఐఫోన్ 14 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉంటుంది. ఇది 1284 x 2778 పిక్సెల్‌ల రిజల్యూషన్‌‌కి సపోర్ట్ ఇస్తుంది. దీని బ్రైట్నెస్ 1200 నిట్స్. ఇది లో లైటింగ్‌లో కూడా మంచి బ్రైట్నెస్ అందిస్తోంది. డిస్‌ప్లే‌కి సిరామిక్ షీల్డ్ గ్లాస్‌ ప్రొటక్షన్ ఉంటుంది. ఇది ఫోన్‌ను పడిపోవడం, గీతలు పడకుండా సురక్షితంగా ఉంచుతుంది.

Also Read: అన్నీ గాల్లోనే.. ఫోన్‌పై రూ.4 వేల డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బ్రో..!

ఈ ఫోన్‌లో Apple A15 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది 6 GB RAMని కలిగి ఉంది. 128 GB నుండి 512 GB వరకు స్టోరేజ్‌‌తో వస్తుంది. రెండు 12-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. iOS 17 అవుట్ ది బాక్స్, ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News