Big Stories

iPhone 14 Plus Price Cut: బిగ్గెస్ట్ డిస్కౌంట్.. రూ.12 వేలకే ఐఫోన్ 14 ప్లస్.. అసలు కారణం ఇదే!

iPhone 14 Plus Price Cut: మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫోన్ ప్రైస్ ఎక్కువగా ఉందని కొనలేక పోతున్నారా? అయితే మీకు ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఐఫోన్లపై ఆన్‌లైన్ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫారమ్‌లు ఎప్పటికప్పుడూ ఆఫర్లు, డిస్కౌంట్లు తీసుకొస్తూనే ఉన్నాయి. ప్రతి రోజూ ఐఫోన్ మోడళ్లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి iPhone 14 Plus స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌ను దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్లు, డిస్కౌంట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నెలలో Apple కొత్త ఐఫోన్ సిరీస్ iPhone 16ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని గురించి ఇప్పటికే అనేక్ లీక్‌లు ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ ఐఫోన్‌లు వస్తున్నాయనే వార్త రాగానే పాత మోడళ్ల ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు ఐఫోన్ 14 ప్లస్ ధర లాంచ్ ధర కంటే చాలా తక్కువగా ఉంది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 14 ప్లస్‌పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లలో వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

- Advertisement -

Also Read: ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. కొత్తగా వస్తోంది.. దీనిలో అన్నీ ఎక్కువే!

ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్
ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900కి లిస్ట్ చేయబడింది. ఐఫోన్ 16 సిరీస్ రాకముందే దీని ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు ఈ ఫోన్‌పై 22 శాతం భారీ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లాట్ తగ్గింపుతో మీరు ఐఫోన్ 14 ప్లస్‌ను సమ్మర్ సేల్‌లో కేవలం రూ. 61,999కి కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో మీరు ఈ సమయంలో దాదాపు రూ.18 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడం ద్వారా అదనంగా రూ. 750 డిస్కౌంట్ పొందుతారు. ఇది కాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది.

Also Read: బంపర్ ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై డిస్కౌంట్ల జాతర.. రూ.387కే దక్కించుకోవచ్చు!

ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలుపై వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌లో ఉండి, దాని ఫిజికల్ కండిషన్ కూడా బాగుంటే, మీరు రూ. 50,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉపయోగించుకున్నట్లయితే మీకు ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 11 నుండి 12 వేలకు కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News