Big Stories

iPhone 15 Pro Max Price Dropped: భారీగా పడిపోయిన ఐఫోన్ 15 Pro మాక్స్ ప్రైస్.. ఐ ఫోన్ ప్రియులకు ఇదే చివరి అవకాశం..!

iPhone 15 Pro Max Price Dropped: యాపిల్ కంపెనీ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబైల్ ప్రియులకు గొప్ప ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 15 సిరీస్ ఫేమస్ మోడల్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఇప్పుడు Apple iPhone 15 Pro Maxను కేవలం రూ.91,105లకే కొనుగోలు చేయవచ్చు. దీని కోసం మీరు ఫోన్‌లో అందుబాటులో ఉన్న బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించాలి. ఈ ఐఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఆఫర్ల గురించి తెలుసుకోండి.

- Advertisement -

ఐఫోన్ 15 Pro మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,48,900కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.50,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీరు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడానికి iPhone 14 Pro Max మోడల్‌ని కలిగి ఉంటే మీకు రూ. 50,000 వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

- Advertisement -

Also Read: బడ్జెట్ లెజెండ్.. HMD నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ఒక రేంజ్‌లో ఉంది!

ఇది కాకుండా ఫోన్‌లో రూ. 3000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ. 4,795 డిస్కౌంట్ ఇస్తుంది. అన్ని ఆఫర్‌లను తీసుకుంటే మొత్తం రూ. 57,795 తగ్గింపు లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ కేవలం రూ. 91,105కి దక్కించుకోవచ్చు.

ఐఫోన్ 15 Pro Max 2024 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్.ఈ సంవత్సరం మేలో కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం Apple iPhone 15 Pro Max మొదటి త్రైమాసికంలో  అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. 2024 ఆపిల్, శాంసంగ్ మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

Also Read: చాలా రోజులకు.. ఒప్పో నుంచి కిరాక్ ఫోన్లు.. మొబైల్ అంటే ఇలా ఉండాలి!

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ టైటానియన్ డిజైన్‌తో వస్తుంది. ఇది 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్రో-మోషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం వంటి కలర్ అప్షన్స్‌లో లభిస్తుంది. ఇందులో A17 ప్రో చిప్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా (48 మెగాపిక్సెల్ + 12 మెగాపిక్సెల్ + 12 మెగాపిక్సెల్) సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. USB టైప్-సి ఛార్జింగ్ ఇంటర్‌ఫేస్ ఫోన్‌లో అందుబాటులో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News