Big Stories

Poco X6 Neo 5G Offer: బీభత్సమైన ఆఫర్.. బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

Poco X6 Neo 5G Offer: పొకో స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా సేల్ అవుతున్న వాటిలో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ కూడా ఒకటి. ఇందులో గొప్ప కెమెరాతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. అయితే ఒకప్పుడు 5G మొబైల్స్ ధర చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తక్కువ ధరకే మంచి ఫోన్లు లభిస్తున్నాయి. కస్టమర్లు కూడా బెస్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ ఉన్న ఫోన్ తమ చేతిలో ఉండాలని భావిస్తున్నారు. అలాంటి ఒక డీల్‌ Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉంది. ఫ్లిప్‌‌కార్ట్ దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

POCO X6 నియో 5G ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇందులో పవర్‌ఫుల్ కెమెరాతో పాటు, ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో 24GB ర్యామ్ కలిగి ఉంది. 5000mAh కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ పెద్ద బ్యాటరీకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. Poco బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ ఇది.

- Advertisement -

Also Read: మిస్ చేయకండి.. సగం ధరకే ఐఫోన్ 14 ప్లస్.. ఇక దండయాత్రే!

Poco ఫోన్‌ ఆఫర్ల విషయానికి వస్తే POCO X6 నియో 5G బేస్ వేరియంట్ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 ధరతో అందుబాటులో ఉంది. ఈ ధరతో 16GB, 8GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వేరియంట్‌‌ను దక్కించుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ పొందుతారు. దీని తర్వాత దాని ధర రూ. 13,999కి తగ్గుతుంది.

కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ని ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.9,700 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్టిన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Also Read: ఏముంది దొర.. వివో నుంచి కొత్త 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..!

ఈ పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌తో మంచి పర్ఫామెన్స్ అందిస్తోంది. దీని వెనుక ప్యానెల్‌లో 108MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 16MP సెల్ఫీ కెమెరా ఫోన్‌లో ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News