Big Stories

Nothing Phone Offer: ఆఫర్లతో చంపేస్తున్నారయ్యా.. ఫోన్‌పై రూ.12 వేల డిస్కౌంట్!

Nothing Phone Offer: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ గతంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించేది. అయితే ఇప్పుడు దీనికి సంబంధం లేకుండా అనేక గ్యాడ్జెట్లపై తగ్గింపులు అందిస్తోంది. ఈ మధ్య కాలంలో తరచూ ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ గత ఏడాది జూలైలో భారతదేశంలో నథింగ్ ఫోన్ 2ని విడుదల చేయగా ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించింది.

- Advertisement -

లాంచింగ్ సమయంలో ఫోన్ (2) ధర రూ. 44,999గా ఉండేది. ఫోన్ కొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1ని కలిగి ఉంది. ఫోన్ బేస్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 35,000 ధరతో  కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఇది ప్రారంభించి దాదాపు ఒక సంవత్సరం అయింది. ఫోన్‌లో‌పై ఉన్న ఆఫర్‌లతో పాటు దాని ఫీచర్లు, తదితర వివరాలను తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: ఫోన్ల పండగ.. వివో నుంచి 5G ఫోన్లు.. ఈసారి మతిపోగొట్టారు!

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 35,499 (8GB + 128GB) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (2) 12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,499. 12GB + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999. ఈ ధరలతో స్మార్ట్‌ఫోన్ వైట్ కలర్ వేరియంట్‌ను దక్కించుకోవచ్చు. డార్క్ గ్రే రంగులో ఉన్న 12GB + 256GB, 12GB + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లు వరుసగా రూ. 37,499. రూ. 39,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్ ఇంతటితే అయిపోలేదు. నథింగ్ ఫోన్ (2) స్మార్ట్‌ఫోన్‌ మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్‌తో పాటు మీరు రూ. 1,999కి CMF లేదా CMF ఆరెంజ్ ఛార్జర్‌ను కూడా దక్కించుకోవచ్చు. అదే సమయంలో కంపెనీ నో-కాస్ట్ EMI ఆఫర్, 12 నెలల Spotify ప్రీమియంను రూ.699కి అందిస్తోంది. మొత్తం మీద ఫోన్‌పై రూ.11,999 ప్రైస్ తగ్గుతుంది.

నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే 120 Hz రిఫ్రెష్ రేట్ 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే 1080×2412 పిక్సెల్‌ల (FHD+) రిజల్యూషన్‌ని 394 పిక్సెల్స్ పర్ ఇంచ్ (ppi)  అందిస్తుంది. నథింగ్ ఫోన్ (2) స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. Android 13లో రన్ అవుతుంది. 4700mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: జాతరే జాతర.. రూ.6,999కే మూడు కొత్త ఫోన్లు.. ఇవి జాతిరత్నాలు!

కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 50-మెగాపిక్సెల్ (f/1.88) ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ (f/2.2) కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇది సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.45 ఎపర్చర్‌తో 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్పెషల్ ఫీచర్‌గా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ ఉంది. సెఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News