EPAPER

Covid Vaccine:గుండె సంబంధిత వ్యాధులపై కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్..

Covid Vaccine:గుండె సంబంధిత వ్యాధులపై కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్..

Covid Vaccine:కోవిడ్ మహమ్మారి నుండి తప్పించుకొని శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్స్‌ను తయారు చేశారు. ఇది ఒకేసారి వేసుకుంటే అంత మెరుగ్గా పనిచేయదని దీనికి రెండు డోసులను తయారు చేశారు. ఆపై బూస్టర్ డోస్ అనేదాన్ని కూడా తయారు చేసి ప్రజలకు అందించారు. కానీ ఈ వ్యాక్సిన్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మెల్లగా బయటపడుతోంది.


ఇటీవల కొన్ని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో.. కోవిడ్ అనేది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఆ ప్రభావం అలాగే ఉండిపోతుందని వారు గమనించారు. వయసు పెరుగుతున్నకొద్దీ దీని ఎఫెక్ట్ మరింత పెరుగుతుందని వారు తెలిపారు. కానీ ఇది ఎక్కువగా ముందు నుండి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో మాత్రమే జరుగుతుందని వారు తేల్చారు.

ఇప్పుడు కోవిడ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏమైన వచ్చే అవకాశం ఉందా, దాని వల్ల గుండెపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే విషయంలో అమెరికన్ శాస్త్రవేత్తలు స్టడీ చేసి ఓ రీసెర్చ్ లెటర్‌ను తయారు చేశారు. వ్యాక్సిన్ అనేది గుండెపాటుతో పాటు ఇతర గుండె సంబంధిత వ్యాధుల విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ లెటర్‌లో పేర్కొన్నారు. వారు తయారు చేసిన ఈ రీసెర్చ్ లెటర్ పేరే ‘ఇంపాక్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆన్ మేజర్ అడ్వర్స్ కార్డియోవ్యాస్కులర్ ఈవెంట్స్ ఇన్ పేషెంట్స్ విత్ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్’.


అసలు వ్యాక్సిన్ అనేది గుండె సంబంధిత వ్యాధులపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి అమెరికాలో జరిగిన మొదటి పరిశోధన ఇదే. ఈ పరిశోధన కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ సోకినవారిని పరీక్షించారు. అందులో వ్యాక్సిన్ తీసుకున్నవారిపై కూడా ప్రత్యేకంగా పరీక్షలు చేపట్టారు. ఈ పరిశోధనల్లో గుండె సంబంధిత వ్యాధులకు, కోవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం ఉండదని వారు తేల్చారు. అంతే కాకుండా వ్యాక్సిన్.. అలాంటి పేషెంట్లకు సాయం చేస్తుందని అన్నారు.

ముందు నుండే గుండె సంబంధిత వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, కొలెస్ట్రాల్, లివర్ వ్యాధులు, ఒబెసిటీ లాంటి సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకుంటే ఆ సమస్యల ప్రభావం చాలావరకు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గమనించారు. అంతే కాకుండా వ్యాక్సిన్ అనేది కోవిడ్ సోకిన తర్వాత కూడా వచ్చే అనేక సమస్యలను కంట్రోల్ చేయగలదని వారు తెలిపారు. ఒకే డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉందని అందరికీ శుభవార్త చెప్పారు అమెరికన్ శాస్త్రవేత్తలు.

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఆ సమస్యకు చెక్.. సెండ్ అయిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు..

Mystery :మిస్టరీ పెయింటింగ్ వివరాలు కనిపెట్టిన ఏఐ..

Tags

Related News

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Big Stories

×