BigTV English

Mystery :మిస్టరీ పెయింటింగ్ వివరాలు కనిపెట్టిన ఏఐ..

Mystery :మిస్టరీ పెయింటింగ్ వివరాలు కనిపెట్టిన ఏఐ..

Mystery :ఎప్పటినుండో మనుషులు కనిపెట్టలేని ఎన్నో విషయాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) కనిపెట్టగలదని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఇప్పటివరకు ఏఐ కేవలం మనుషుల సూచనలను బట్టే పనిచేసేది. దానిలో అమర్చబడిన ఫీచర్స్‌కు తగ్గట్టుగా ప్రవర్తించేది. కానీ ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఒక పెయింటింగ్‌ వివరాలను గుర్తించడానికి ఏఐ సహాయపడింది. ఇది శాస్త్రవేత్తలను సైతం షాక్‌కు గురిచేస్తోంది.


గత 40 ఏళ్లుగా ‘డీ బ్రెన్సీ టోండో’ అనే పెయింటింగ్‌ను ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు అనే విషయాలను తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులోని ఫెస్ గుర్తింపు టెక్నాలజీ ద్వారా ఈ పెయింటింగ్‌ను అలనాటి ఫేమస్ పెయింటర్ రాఫెల్ వేశారని ఏఐ గుర్తించింది. రాఫెల్ వేసిన ఇతర పెయింటింగ్స్‌ను స్టడీ చేసిన తర్వాత.. వాటికి వీటికి 97 శాతం మ్యాచ్ ఉందని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. పరిశోధకులకు తెలిపింది.

రాఫెల్ ఇతర పెయింటింగ్స్‌తో పోలిస్తే.. ఇది కాస్త భిన్నంగా ఉంటుందని, అందుకే ఇప్పటివరకు అది రాఫెలే వేశారని నిర్ధారించలేకపోయామని పరిశోధకులు అన్నారు. మనిషి కంటితో చూసేదానికంటే కంప్యూటర్ మరికాస్త క్షుణ్ణంగా పరిశీలించగలుగుతుందని వారు తెలిపారు. ఎన్నో వేల డైమెన్షన్స్ నుండి పిక్సెల్స్ వరకు కంప్యూటర్ గమనించగలదని అన్నారు. ఏఐ.. ఈ పెయింటింగ్ గురించి తెలుసుకున్న విషయాన్ని ప్రకటించేందుకు పరిశోధకులు ప్రెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేశారు.


డీ బ్రెన్సీ టోండో లాగానే మరో పెయింటింగ్ ఉంటుంది. అది కూడా రాఫెల్ వేసిందే. ఈ రెండు పెయింటింగ్స్‌ను చూసి.. ఈ రెండు ఒకరే వేశారని అనిపించినా.. పరిశోధకులు దానిని పూర్తిగా నిర్ధారించలేకపోయారు. కానీ ఏఐ మాత్రం వాటిని పూర్తిగా స్టడీ చేసి రాఫెలే వేశారని తెలిపింది అని పరిశోధకులు ప్రెస్ మీట్‌లో తెలిపారు. 1981లో జరిగిన ఒక వేలంపాటలో అప్పటి కలెక్టర్ ఈ పెయింటింగ్‌ను కొన్నారు. అప్పటినుండి ఇది ఎవరు వేశారు అనే ప్రశ్నకు సమాధానం తెలియలేదు.

రాఫెల్ వేసిన డీ బ్రెన్సీ టోండో పెయింటింగ్‌లో ఒక మహిళ.. బిడ్డను ఎత్తుకుని ఉంటుంది. అసలు వారు ఎవరు అని ఇంకా తెలియకపోయినా.. వారికి, రాఫెల్‌కు ఏదో ఒక విధంగా సంబంధం ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఆ పెయింటింగ్‌పై పరిశోధనలు చేస్తున్న క్రమంలో అందులో ఉన్నది సిస్టీన్ మడోనా అనే మహిళ అని అనుమానిస్తున్నారు. ఇతర వివరాల గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Kissing Device: లవర్ దూరంగా ఉన్నా ముద్దు పెట్టొచ్చు.. ఎలాగంటే?

WhatsApp: వాట్సాప్‌లో ఇక ఆ సమస్యకు చెక్.. సెండ్ అయిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×