BigTV English

Color Changing:ఇంటి వాతావరణాన్ని కంట్రోల్ చేసే కలర్..

Color Changing:ఇంటి వాతావరణాన్ని కంట్రోల్ చేసే కలర్..

Color Changing:ఆర్టిఫిషియల్‌గా తయారు చేసుకున్న వనరులే ప్రస్తుతం మానవాళికి చాలా ముఖ్యంగా మారిపోయాయ. కరెంటు, గ్యాస్.. లాంటివి లేకుండా జీవనం సాగించలేము అన్న పరిస్థితి ఏర్పడింది. కానీ మనుషుల వినియోగాన్ని బట్టి వీటిని తయారు చేయడం కూడా కష్టంగా మారుతోంది. అందుకే కరెంటు వినియోగాన్ని అదుపు చేయడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. తాజాగా ఇందులో మరో కొత్త విషయాన్ని వారు కనుగొన్నారు.


ఇంట్లో అందరూ సౌకర్యంగా ఉండే వాతావరణాన్నే ఇష్టపడతారు. అందుకే బయట చల్లగా ఉంటే.. హీటర్ ఆన్ చేసుకుంటారు, వేడిగా ఉంటే ఏసీ ఆన్ చేసుకొని విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల కరెంటు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అమెరికన్లు వినియోగించే సగం వరకు కరెంటు దాదాపు ఇళ్లకే ఉపయోగపడుతుందని తేలింది. దీని వల్లే వారికి కరెంటు బిల్లుల భారం ఎక్కువగా పడుతుండడంతో పాటు గ్రీన్ హౌస్ గ్యాస్‌లు కూడా ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఈ సమస్యలను అదుపు చేయడానికే భవనాల నిర్మాణంలో మార్పులు వచ్చాయి.

ప్రస్తుతం అమెరికాలో కొత్తగా కట్టుకుంటున్న ఇల్లులు ఐసోలేషన్ పద్ధతిలోనే కట్టబడుతున్నాయి. అందుకే కరెంటు వినియోగం విషయంలో ఏ ప్రమాదం లేదు. కానీ ఇదివరకు చేసిన పాత కట్టడాల్లో ఐసోలేషన్ అనేది లేదు. అందుకే అవి ఎక్కువ కరెంటు వినియోగానికి కారణమవుతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలోనే కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఈ సమస్యకు వారికి ఒక పరిష్కారం దొరికింది. కేవలం కలర్‌తోనే బిల్డింగ్ వాతావరణాన్ని మార్చే మార్గాన్ని వారు కనిపెట్టారు.


క్రెడిట్ కార్డ్ కంటే సన్నగా ఉండే ఒక ఫిల్మ్.. బిల్డింగ్ వాతావరణాన్ని కావాల్సినప్పుడు చల్లగా లేదా వేడిగా మార్చుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ ఫిల్మ్ పనిచేయడానికి ఎక్కువ కరెంటు కూడా అవసరం లేదని వారు అన్నారు. పాత కట్టడాలపై కూడా ఈ ఫిల్మ్‌ను అమర్చితే.. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతుందని వారు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు కూడా. ఈ ప్రయోగం ద్వారా అమెరికాలో కరెంటు వినియోగం ఇప్పటికైనా అదుపులోకి వస్తుందని వారు ఆశిస్తున్నారు.

India and Germany:ఇండియాతో చేయి కలిపిన మరో దేశం..

Blood Easily:క్యాన్సర్‌ను మరింత సులువుగా గుర్తించవచ్చు!..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×