BigTV English

Blood Easily:క్యాన్సర్‌ను మరింత సులువుగా గుర్తించవచ్చు!..

Blood Easily:క్యాన్సర్‌ను మరింత సులువుగా గుర్తించవచ్చు!..

Blood Easily:టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత ఎంత కఠినమైన ఆరోగ్య సమస్యను అయినా కనిపెట్టడం చాలా సులువుగా మారింది. అంతే కాకుండా ఒకప్పుడు చికిత్స లేకుండా ఎంతోమందిని బలిదీసుకున్న వ్యాధులకు కూడా ఇప్పుడు చికిత్స దొరుకుతోంది. అలాంటి ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ బారినుండి ప్రజలను కాపాడడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.


మామూలుగా ఒక మనిషి శరీరంలో క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎన్నో విధమైన టెస్టులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను కనుక్కునే కొత్త యంత్రాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరికరం ద్వారా క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్మెంట్ ప్రక్రియను, ఆపై వారి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్‌ను కూడా కనిపెడుతూ ఉండవచ్చని తెలుస్తోంది. తాజాగా ఈ పరికరాన్ని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

ఆస్ట్రేలియాలో క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు ప్రతీ ఏడాది 1,50,000 మంది క్యాన్సర్ బారినపడుతున్నారు. మామూలుగా క్యాన్సర్‌ను ట్రీట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి బయోప్సీ. కానీ ఇది పేషెంట్లకు అసౌకర్యాన్ని కలిగించే ప్రక్రియ. అంతే కాకుండా ఈ సర్జరీ తర్వాత పేషెంట్లలో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అందుకే క్యాన్సర్‌ను ఎఫెక్టివ్‌గా గుర్తించగలిగితే.. వేరే మార్గాల్లో కూడా చికిత్స చేసే అవకాశం లభిస్తుంది.


మామూలుగా టిష్యూలకు బయోప్సీ చేసి క్యాన్సర్‌ను కనుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా బ్లడ్ శాంపిల్స్ నుండే ట్యూమర్ సెల్స్‌ను కనిపెట్టడం మరింత మెరుగైన మార్గమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా పేషెంట్లపై మళ్లీ మళ్లీ టెస్టులు చేయాల్సిన అవసరం డాక్టర్లకు రాకుండా ఉంటుందని వారు తెలిపారు. స్టాటిక్ డ్రాప్లెట్ మైక్రోఫ్ల్యూడిక్ అనే పరికరం ద్వారా ఒక అవయవంలో ఏర్పడిన ట్యూమర్.. బ్రేక్ అయ్యి రక్తంలో కలిసిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ఒక్కసారి స్టాటిక్ డ్రాప్లెట్ మైక్రోఫ్ల్యూడిక్ పరికరం ద్వారా రక్తంలోని ట్యూమర్ సెల్స్‌ను కనిపెట్టిన తర్వాత దానికి తగిన చికిత్సను మెరుగ్గా అందించే అవకాశం వైద్యులకు లభిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక అవయవానికి వచ్చిన తర్వాత అది రక్తంలోకి చేరి ఇతర అవయవాలకు వ్యాపించడమే మరణాలకు కారణం. అలా జరగకుండా ఉండేందుకు రక్తంలో ఉన్నప్పుడే ఆ ట్యూమర్ సెల్స్‌ను కనిపెట్టడం ముఖ్యమని శాస్త్రవేత్తలు ఈ కోణంలో పరిశోధనలు చేపట్టారు. ఇప్పుడు వారు తయారు చేసిన స్టాటిక్ డ్రాప్లెట్ మైక్రోఫ్ల్యూడిక్ పరికరం క్యాన్సర్ మరణాలను అదుపు చేస్తుందని వారు భావిస్తున్నారు.

Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

India and Germany:ఇండియాతో చేయి కలిపిన మరో దేశం..

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×