Big Stories

CMF Phone 1 Smartphone: కొళ్లగొట్టేందుకు కొత్త బ్రాండ్.. లాంచ్‌కు సిద్ధమైన ‘CMF Phone 1’.. ఫీచర్లు ఓ రేంజ్..!

CMF Phone 1 smartphone will be launched on July 8: ప్రస్తుత టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ నథింగ్ కంపెనీది సపరేట్ బ్రాండ్. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్లు అద్భుతమైన రెస్సాన్స్‌ను అందుకున్నాయి. స్మార్ట్‌ఫోన్లే గాక ఇయర్ బడ్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. అయితే ఇప్పుడు నథింగ్ సబ్-బ్రాండ్ CMF ఫోన్ నుంచి త్వరలో ‘CMF Phone 1’ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

- Advertisement -

నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఈ ఫోన్ జూలై 8న లాంచ్ కానుంది. దీంతో ఈ ఫోన్‌ ఎలా ఉండబోతుందా అని అందరూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అందులోనూ కంపెనీ ఒక్కొక్క అప్డేట్‌ను రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియుల్లో మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇటీవలే కంపెనీ CMF Phone 1 డిస్‌ప్లేను వెల్లడించింది. ఈ డిస్‌ప్లే అందరికి బాగా నచ్చేసింది. అంతేకాకుండా ఈ ఫోన్ లాంచ్ అయ్యే వరకు ఒక్కొక్క అప్డేట్‌ను ఇస్తామని కంపెనీ తెలిపింది.

- Advertisement -

అయితే ఇందులో భాగంగానే తాజాగా మరొక అప్డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త టీజర్‌ రిలీజ్ చేసింది. అందులో ఫోన్ ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యాన్ని వెల్లడించింది. CMF ఫోన్ 1 ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఇందులోని ప్రధాన స్పెసిఫికేషన్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన CMF ఫోన్ 1 ప్రాసెసర్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్ అమర్చబడిందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో 8 కోర్లు ఉన్నాయని తెలిపింది. వీటిలో నాలుగు పెర్ఫార్మెన్స్ కోర్లు 2.5GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి.

Also Read: నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 ఫీచర్లు లీక్.. ధర, స్పెసిఫికేషన్, లాంచ్ వివరాలివే!

అలాగే CMF ఫోన్ 1 RAM సామర్థ్యం విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ మొత్తం 16 GB RAMని పొందుతుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్ వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ధర భారతదేశంలో రూ.20,000 లోపు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 అంగుళాల sAMOLED డిస్ప్లే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ఇందులో అందించవచ్చు. ఇది డిస్ప్లే మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది 2000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ అందించగలదు. ఇది కాకుండా ఫోన్‌లో HDR10+ సపోర్ట్ కూడా అందించబడుతుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా బ్యాక్‌సైడ్ లెదర్‌తో ఆరెంజ్ అండ్ మాటీ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీతో 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News