EPAPER

China Over cross America in science : అమెరికాను బయటపెడుతున్న చైనా.. సైన్స్ విషయంలో.

China  Over cross America in science : అమెరికాను బయటపెడుతున్న చైనా.. సైన్స్ విషయంలో.

China Over cross America in science : సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే ముందుగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి. ఇప్పటివరకు అక్కడ ఉన్న సైన్స్, టెక్నాలజీ వేరే దేశంలో లేవని అక్కడి ఎక్స్‌పర్ట్స్ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అమెరికాకు షాకిస్తూ సైన్స్ విభాగంలో మరో దేశం ముందుకొచ్చింది.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై క్వాలిటీ సైన్స్ విధానాన్ని చైనా శాసించే స్థాయికి ఎదిగిందని నిపుణులు గుర్తించారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో పోలిస్తే చైనా శాస్త్రవేత్తలు పరిశోధనల విషయంలో వేగం చూపిస్తున్నారని వారు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించడమే దీనికి కారణమని తెలుస్తోంది.

సైన్స్ విభాగంలో చైనా ఎదుగుదల చూసి నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. దాని కారణంగా త్వరలోనే ప్రపంచ సైన్స్‌ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని అమెరికా భయపడుతోంది. ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో టాప్‌లో ఉండాలని చైనా తన దేశ పాలిసీల్లో సూచించినట్టుగా వారు గుర్తించారు.అందుకే చైనాతో తలపడడానికి అమెరికా సిద్ధపడుతోంది.


2000 తర్వాత చైనా చాలావరకు యువతను ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేలా అనుమతినిచ్చింది. అందులో చాలావరకు సైన్స్ అండ్ టెక్నాలజీని చదువుకోవడానికి ఎంచుకున్నారు. కొందరు విద్యార్థులు చదువుకోవడానికి వెళ్లినా దేశాల్లో సెటిల్ అయినా.. మిగతవారు మాత్రం తిరిగి చైనాకు వచ్చే అక్కడే తమ కెరీర్‌ను ప్రారంభించారు. ఇది చైనా సైన్స్‌ను మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడింది.

ప్రస్తుతం అమెరికా తర్వాత సైన్స్ విభాగంలో ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశం చైనానే. 2017లో అమెరికాకంటే చైనా ఎక్కువ పరిశోధనలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. మొదట్లో చైనా ఎలాంటి పరిశోధన చేసినా పలు ప్రపంచ దేశాలు వాటిని కొట్టిపారేశాయి. కానీ తర్వాత చైనా సైన్స్‌లో పెరిగిన క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

చైనా తమకు పోటీనిస్తుంది అని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు ఎలర్ట్ అయ్యారు. అందుకే అమెరికా చేసిన పలు రిసెర్చ్‌లకు చైనాకు యాక్సెస్ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే సైన్స్ విభాగంలో చైనా ఎదుగుదలను ఆపడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టిందని అర్థమవుతోంది. కానీ అమెరికా, చైనా వంటి దేశాలు కలిసి పనిచేస్తే సైన్స్ అనేది మరింత క్వాలిటీతో బయటికి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×