BigTV English

Scientists Create Speech From Brain Signals : ఆలోచనలను మాటలుగా మార్చే యంత్రం.. త్వరలోనే..

Scientists Create Speech From Brain Signals : ఆలోచనలను మాటలుగా మార్చే యంత్రం.. త్వరలోనే..

Scientists Create Speech From Brain Signals : మెదడులో వచ్చే ఆలోచనలను కళ్ల ముందు కనిపించేలా చేయడానికి ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. తాజాగా దానికి సంబంధించిన పరిశోధనలను మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే వారు కొత్త అధ్యాయానికి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది.
మామూలుగా మనుషుల మనసులోని మాటలు బయటికి వచ్చిన తర్వాత అవి నిజమా, అబద్ధమా అని తేల్చే యంత్రాలు ఇప్పటికే టెక్ వరల్డ్‌లో ఉన్నాయి. కానీ మొదటిసారి మనిషి నోటి నుండి మాట బయటికి రాకముందే వారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియజేసే యంత్రాలు కనుగొనడానికి పరిశోధనలు మొదలయ్యాయి.


కొత్త రకమైన న్యూరల్ నెట్‌వర్క్ ద్వారా మనిషి ఏం మాట్లాడానుకుంటున్నాడో ముందే చెప్పవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. సైన్స్ అండ్ యూనివర్సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ విభాగంలో పరిశోధనలకు రష్యా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో పాటు కొంత ఫండ్‌ను కూడా పరిశోధకులకు అందజేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మాటలు రాని వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారికోసం ఈ పరిశోధన విజవంతం కావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈరోజుల్లో మాటలు రాని వారికి సాయంగా టెక్నాలజీ నిలుస్తోంది. సైలెంట్ స్పీచ్ లాంటి పరికరాలు మాటలు రాని వారి నోటి కదలికలను బట్టి వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఇతరులకు తెలిసేలా చేస్తున్నాయి. కానీ నోరు కూడా కదిలించలేని వారికి ఈ యంత్రం ఉపయోగపడదు. అలాంటి వారికి ఈ కొత్త న్యూరో పరికరం సాయం చేస్తుంది. వీటిని పర్సనల్ కంప్యూటర్లుగా కూడా ఉపయోగించవచ్చు. దీనినే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అంటారు.


ఒక సర్జరీ ద్వారా ఎలక్ట్రాడ్స్‌ను బ్రెయిన్‌లో పెట్టడం ద్వారా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ పనిచేస్తుంది. అయితే ఈ సర్జరీ రిస్క్‌తో కూడుకున్న పని కావడంతో శాస్త్రవేత్తలు ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధనలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×