Big Stories

Best Waterproof Smrtphones: నీటిలో తడిసినా ఈ ఫోన్‌లకు ఏం కాదు.. భలేగున్నాయి కదా..!

Waterproof Mobile phones: వర్షాకాలం వచ్చింది. సాధారణంగా ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్లు నీళ్లలో తడిచిపోయే సమస్య ఉంటుంది. దీని కారణంగానే ఫోన్ ఆగిపోవటం లేదా హ్యాంగ్ అయిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దాన్ని రిపేర్ సెంటర్‌కు తీసుకువెళితే అధిక మొత్తంలో డబ్బులు వసూళు చేస్తాడు. అయితే అలాంటి సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఐపీ 68, ఐపీ 69 రేటింగ్స్ ఉన్న వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫోన్లు బెస్ట్‌గా ఉంటాయి. మరి మీరు కూడా అలాంటి ఒక మంచి ఫోన్‌‌ను కొనుక్కోవాలని ఎదురుచూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని ఫోన్ల జాబితాను అందించాం. అందులో మీకు నచ్చిన ఫోన్‌ను సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు.

- Advertisement -

Oppo F27 Pro Plus

- Advertisement -

ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే డిస్‌ప్లే విషయానికొస్తే.. ఈ ఫోన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే‌ను కలిగి ఉంది. దీని ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌గా ఉంది. అలాగే ఫోన్‌ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర విషయానికొస్తే.. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.27,999 ల ధరతో రిలీజ్ చేసింది.

Redmi Note 13 Pro Plus

Also Read: తస్సాదియ్య.. 108 మెగా పిక్సెల్ కెమెరాతో మరో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మి ఫోన్ వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌ రేటింగ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్ ప్రాసెసర్‌ అమర్చారు. అలాగే 1.5కే రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల కర్వ్ డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్ వెజిటేరియన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో సహా ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలు అందించారు. అలాగే 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.30,999గా కంపెనీ నిర్ణయించింది.

Motorola Edge 50 Pro

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.5కే రిజల్యూషన్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఫొటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50మెగా పిక్సెల్, 13 మెగా పిక్సెల్, 10 మెగా పిక్సెల్ వంటి మూడు కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందించింది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.29,999గా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News