Big Stories

iPhone 16 Leaks: ఐఫోన్ 16 ఆగయా.. అదిరిపోయిన ఫీచర్లు!

iPhone 16 Leaks: ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే Apple iPhone 16 సిరీస్‌‌ను విడుదల చేయకముందే దీనికి సంబంధించి అనేక లీక్‌లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 కెమెరా మాడ్యూల్ డిజైన్ ఐఫోన్ X తరహా డిజైన్‌లో ఉండొచ్చని లీక్స్‌ ద్వారా తెలుస్తుంది. ఇదే విధమైన కెమెరా మాడ్యూల్ Samsung Galaxy S24 సిరీస్‌లో కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ 16లో వర్టికల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారం చూద్దాం.

- Advertisement -

టెక్ ఇన్ఫర్మేషన్ టిప్‌స్టర్ మాజిన్ బూ ఐఫోన్ 16 సిరీస్ కెమెరా ప్రొటెక్టర్‌ను వివరించారు. దాని ప్రకారం Apple iPhone 16, iPhone 16 Plus కోసం వర్టికల్ కెమెరా లేఅవుట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాకుండా ఐఫోన్ 16 ప్రో మోడల్ కొత్త 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌‌తో రావచ్చు. ఈ సెన్సార్ 0.7μm పిక్సెల్‌తో 1/2.55 అంగుళాలు ఉండవచ్చు. ఇది మరింత డీటైల్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

- Advertisement -

Also Read: అబ్బా ఏమైనా ఉందా.. వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇది కొనాల్సిందే!

ఇది కాకుండా కంపెనీ iPhone 16 Proలో 5x జూమ్ కెమెరాను కూడా తీసుకొస్తుంది. అయితే iPhone 16 Pro Max  జూమ్ కెపాసిటీ iPhone 15 Pro Max నుండి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. iPhone 16 Pro Max మెయిన్ కెమెరా 1/1.14-అంగుళాల సైజ్‌తో కస్టమ్ 48MP సోనీ IMX903 సెన్సార్‌తో అప్‌గ్రేడ్ చేయబడుతుంది. Sony IMX-803 సెన్సార్ కంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది.

Apple iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడళ్ల స్క్రీన్ సైజుల్లో కూడా మార్పును చూడవచ్చని లీక్‌లు వెల్లడిస్తున్నాయి. కొత్త సిరీస్ సైజు పెరగుతుంది. లీకైన డమ్మీ ఫోటోల ప్రకారం ఈ మోడల్ వరుసగా 6.3-అంగుళాల, 6.9-అంగుళాల డిస్‌ప్లేలతో రావచ్చు. ఇవి ఐఫోన్ 15 ప్రో మోడల్ డిస్‌ప్లే కంటే 0.2 అంగుళాలు పెద్దదిగా ఉంటుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మంచి లుక్‌తో రానున్నాయి.

Also Read: ఇదెలా సాధ్యం.. వేలల్లో తగ్గిన ఐఫోన్ ప్రైజ్.. మిస్ కాకండి!

ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తేదీ గురించి మాట్లాడితే ప్రస్తుతం ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తేదీకి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలదేదు. అయితే కంపెనీ సెప్టెంబర్ మధ్య వారంలో ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్ ధర సుమారు రూ. 1 లక్ష వరకు ఉండొచ్చు. అయితే ఈ ఫోన్ ధరకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News