Big Stories

Mobile Offers: మాటల్లేవ్.. రూ.8 వేలకే కొత్త 5G ఫోన్.. ఇక దండయాత్రే!

Mobile Offers: మీరు 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడామీ బడ్జెట్ రూ. 10 వేల కంటే తక్కువగా ఉంటే మీకు అదిరిపోయే శుభవార్త. Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. భారతదేశంలో లావా నుండి వచ్చిన చౌకైన 5G ఫోన్ ఇదే. అంతే కాకుండా ఇందులో మంచి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని యూత్ కోసం కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఒకసారి చూద్దాం.

- Advertisement -

భారతదేశంలో Lava Yuva 5G ప్రారంభ ధర రూ. 9,499. స్టోరేజీని బట్టి ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. దీని 4GB + 64GB వేరియంట్ ధర రూ. 9,499. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,999. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, లావా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ కూడా ఈ ఫోన్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తున్నాయి.

- Advertisement -

Also Read: నాన్నకు ప్రేమతో.. బెస్ట్ చీపెస్ట్ మొబైల్ గిఫ్ట్స్.. ప్రేమను రెట్టింపు చేద్దాం!

OneCard Credit Card EMI ట్రాన్జాక్షన్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్‌లకు 500 రూపాయల వరకు, IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్‌లకు 250 రూపాయల వరకు డిస్కౌంట్ Amazon అందిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఫోన్ 64GB వేరియంట్ ధర రూ. 8,999. దీని కోసం కనీసం రూ.7500 పేమెంట్ చేయాలి.

ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ ఫోన్‌పై చాలా బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI లావాదేవీ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు లభిస్తుంది. దీని కోసం కనీస మొత్తం రూ. 5000,  18 నుండి 24 నెలల వరకు EMI ఉండాలి. మీరు బ్యాంక్ ఆఫర్‌‌లను పూర్తిగా ఉపయోగించుకున్నట్లయితే 64GB వేరియంట్ ధర రూ.7999గా అవుతుంది.

Lava Yuva 5G ఫోన్ 6.3-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది HD ప్లస్ రిజల్యూషన్‌తో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ Unisock T750 ప్రాసెసర్‌తో Android 13లో రన్ అవుతుంది. ఫోన్ 64GB, 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. రెండూ 4GB స్టాండర్డ్ RAMని కలిగి ఉంటాయి. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని పెంచుకోవచ్చు.

Also Read: గేమ్ ఛేంజర్.. ఒప్పో రెండు కొత్త ఫోన్లు.. రికార్డులు బ్రేక్!

ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, FM రేడియో సపోర్ట్‌తో వస్తుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News