Big Stories

Virat Kohli Mobile: విరాట్ కోహ్లీ మొబైల్ దొరికేసింది.. ప్రైజ్ మరీ ఇంత తక్కువా.. అసలు ఊహించలేదు భయ్యో!

Virat Kohli Mobile: టీ-20 ప్రపంచ‌కప్‌లో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసింది. 11 ఏళ్లుగా ఊరిస్తోన్న ప్రపంచప్‌ను అందుకొని రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇరు జట్లు కన్నీటిపర్యంతమయ్యాయి. ఒకరి సంతోషం మరొకరికి దుఃఖాన్నినింపింది. మన ఇండియా టీమ్ ఆనందాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్న విరాట్ కోహ్లీ 76 పరుగుల సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాడు.

- Advertisement -

మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది అభిమానులు విరాట్ వారు ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఇంటర్నెట్‌లో వెతికేస్తున్నారు. అయితే, విరాట్ చాలా సందర్భాలలో వివిధ స్మార్ట్‌ఫోన్‌లతో కనిపిస్తాడు. అయితే 2024 T20 వరల్డ్ కప్‌లో విరాట్ ఉపయోగించిన ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఐఫోన్‌తో కనిపించాడు. మ్యాచ్ సమయంలో క్రికెటర్ ఉపయోగిస్తున్న ఐఫోన్‌ను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇది ఐఫోన్ 15 ప్రో వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అంటే విరాట్ కోహ్లీ ప్రధానంగా ఐఫోన్ 15 ప్రోను ఉపయోగిస్తున్నారు.

మ్యాచ్ సమయంలో విరాట్ చాలాసార్లు వీడియో కాల్‌లో మాట్లాడటం చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వైరల్ వీడియోలో విరాట్ భార్య అనుష్కతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో విరాట్ మాట్లాడుతున్న ఫోన్ ఐఫోన్ 15 ప్రో. ఇది అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే కింగ్ కోహ్లీకి చెందిన ఈ ఫోన్ చాలా ఖరీదైనది. విరాట్ iPhone 15 Pro 1 TB మోడల్‌ని ఉపయోగిస్తున్నారు. దీని ధర లక్షన్నర రూపాయల కంటే ఎక్కువ.

Apple iPhone 15 Pro Specifications
1 TB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 1,84,900కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కోహ్లీ ఉపయోగించే వేరియంట్ ఇదే. ఈ ఫోన్ 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్ 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ హెక్సా కోర్ Apple A17 Pro ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ iOSలో రన్ అవుతుంది.

Also Read: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!

iPhone 15 Pro 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ మొబైల్.  నానో సిమ్ కార్డ్‌లతో వస్తుంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ ఆప్షన్‌లతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11 b/g/n/ac/ax, GPS, NFC, USB టైప్ C, 3G, 4G, LTE నెట్‌వర్క్‌ ఉన్నాయి. ఫోన్‌లో సెన్సార్ల గురించి చెప్పాలంటే యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు కంపాస్/మాగ్నెటోమీటర్ ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News