Big Stories

Realme Narzo N65 5G Offer: పొద్దు పొద్దునే కళ్లు చెదిరే ఆఫర్.. చాలా తక్కువ ధరకే రియల్ మి నార్జో N65 5జీ ఫోన్.. వదలొద్దు మావా!

Offer on Realme Narzo N65 5G Mobile: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మి కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ తన క్రేజ్‌ను మరింత క్రియేట్ చేసుకుంటుంది. ప్రస్తుత టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఫోన్ వినియోగదారుల కోసం సేఫ్టీ పరంగా అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తుంది. అంతేకాకుండా బడ్జెట్ ధరలోనే ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే రియల్ మి కంపెనీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన కొత్త ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేదో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో Realme Narzo N65 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240Hzగా ఉంది. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 4GB RAM + 128GB ఇంటర్నెల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఫోన్ టాప్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది.

- Advertisement -

Realme Narzo N65 5G ఫోన్ వెనుక భాగంలో 50MP AI కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం.. ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించారు. ఇతర ఫీచర్లలో నైట్ మోడ్, పనో మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, స్ట్రీట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్ వంటివి ఉన్నాయి. ఇందులో 2 నానో సిమ్ కార్డ్ స్లాట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ అందించబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మీ యూఐ 5.0తో ఫోన్ రన్ అవుతుంది.

Also Read: కిక్కే కిక్కు.. ఫస్ట్‌ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇంత చీపా.. పరుగులే పరుగులు!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 18W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఛార్జింగ్ కోసం ఫోన్‌లో USB టైప్-సి పోర్ట్‌ని అందించారు. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ రూ.11,499 ధర నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఫోన్ టాప్ వేరియంట్ రూ.12,498కి వస్తుంది. ఈ ఫోన్ అంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.1500 కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితోపాటు నో కాస్ట్ EMI కూడా ఉంది. కేవలం రూ.606తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆపై ప్రతినెల చెల్లించుకోవలసి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News