Big Stories

Hyderabad: డ్రోన్లతో రెక్కీ.. బాంబుల తయారీలో ట్రైనింగ్.. ఉగ్రవాదుల భారీ స్కెచ్..

terrorists training

Hyderabad News Today(Telangana Breaking News): మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌, తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌ లో బయటపడ్డ హిజాబ్ ఉత్ తహ్రీర్ సంస్థ ఉగ్రకార్యకలాపాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisement -

ఉగ్ర ముఠా…బయాన్ పేరుతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. 2018లో ప్రధాన నిందితుడు మహమ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ హైదరాబాద్ కు వచ్చినట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త సూచనల మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ మెడికల్ కళాశాలలో మహమ్మద్ సలీం ఉద్యోగం సంపాదించారు. భూపాల్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాక సలీం తన కార్యకలాపాలు ప్రారంభించారు.

హైదరాబాదును ఒక స్లీపర్ సెల్ గా వాడుకున్న మహమ్మద్ సలీం బయాన్ పేరుతో సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. గోల్కొండలోని సలీం ఇంట్లోనే సమావేశాలు నిర్వహించినట్లు మధ్యప్రదేశ్ ATS పోలీసుల విచారణలో తేలింది. సలీం సమావేశాలకు హాజరైన వారిపై… తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కి తరలించారు.

- Advertisement -

పలు టార్గెట్ లపై డ్రోన్ లతో రెక్కీ కూడా నిర్వహించారట ఉగ్రవాదులు. ఇప్పటికే యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారని.. ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు గుర్తించారు ATS అధికారులు. మధ్యప్రదేశ్‌ లోని అడవుల్లో ఈ ట్రైనింగ్ క్యాంప్ లు జరిగాయని.. మిగిలిన వారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిన వారే అని తేల్చారు.

ఉగ్ర క్యాడర్ పెంచుకునేందుకు భారీగా ప్రణాళికలు రచించింది హిజాబ్ ఉత్ తహ్రీర్. యూత్ ను ఆకర్షించేందుకు డార్క్ వెబ్ యాప్ ల్లో నిత్యం కాంటాక్ట్ లో ఉండేవారని విచారణలో వెల్లడైంది. ఉగ్రవాదులను అరెస్ట్ చేసే సమయంలో జరిపిన సోదాల్లో భారీగా యూత్ ను రెచ్చగొట్టేలా ఉన్న స్పీచ్‌ లు.. టెక్నికల్ పరికరాలు.. నగదును స్వాధీనం చేసుకున్నారు. తమ గుర్తింపు బయటకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఉగ్రవాదులు. సామాన్యులుగా కనిపించేందుకు ఎవరికి వారు ఏదో పనిలో కుదురుకోవాలని వీరికి ఆదేశాలు ఉన్నాయట.

ఉగ్రసంస్థ హిజాబ్ ఉత్ తహ్రీర్ గురించి కూడా ATS ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహ్రీక్ ఈ ఖలీఫత్ పేరుతో కూడా ఈ సంస్థ కార్యాకలాపాలు నిర్వహిస్తోంది. తహ్రీక్ ఈ ఖలీఫత్ 50 దేశాల్లో విస్తరించగా.. 16 దేశాలు ఈ సంస్థపై నిషేధం విధించాయి. ఇక్కడ రిక్రూట్ అయిన క్యాడర్ కు హిజాబ్ ఉత్ తహ్రీర్ విదేశాల్లో ట్రైనింగ్ ఇస్తోందని గుర్తించారు. ఎంపిక చేసిన యువకులకు కెమికల్, బయోలాజికల్ వార్‌ ఫేర్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. సంస్థ కోసం తమ ప్రాణాలను సైతం తీసుకునేలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ATS గుర్తించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News